పార్వతీపురం: వేధింపులు తాళలేక 108 వాహన డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో 108 వాహన డ్రైవర్గా గొట్టాపు అన్నం నాయుడు(38) పని చేస్తున్నాడు.
సెలవు ఇవ్వకుండా సూపర్‌వైజర్ మన్మథరావు వేధింపులకు గురిచేస్తుండటంతో నాయుడు ఆదివారం ఎండ్రిన్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ప్రస్తుతం నాయుడు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.