నల్లధనం మిథ్య! స్విస్ ఖాతాలు మిథ్య! | Swiss bank accounts! | Sakshi
Sakshi News home page

నల్లధనం మిథ్య! స్విస్ ఖాతాలు మిథ్య!

Published Tue, Oct 14 2014 11:14 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

నల్లధనం మిథ్య! స్విస్ ఖాతాలు మిథ్య! - Sakshi

నల్లధనం మిథ్య! స్విస్ ఖాతాలు మిథ్య!

విదేశాల్లోని నల్లధనాన్ని తిరిగి తెస్తామంటూ మోదీ గత ఎన్నికల్లో చేసిన వాగ్దానం దాదాపుగా చంద్రబాబు రుణమాఫీ నినాదమంత ప్రభావాన్ని చూపింది. కాబట్టే బీజేపీని ఇరకాటంలో పెట్టి మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందాలని  సోనియా ‘నల్లధనం మాటేమిటి?’ అని నిలదీస్తున్నారు.
 
‘నల్లధనం మాటేమి టి?’ మహారాష్ట్ర ఎన్నికల సమరంలో సోనియా గాంధీ సంధించిన తాజా అస్త్రం ఇది. ‘విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కు రప్పించడమే నా ప్రధాన లక్ష్యం’ అంటూ నేటి ప్రధా ని నరేంద్ర మోదీ గత ఎన్నికల్లో చేసిన వాగ్దానమే ఆయన గెలుపునకు కారణం కావచ్చు. కానీ అది చం ద్రబాబు రుణమాఫీ నినాదం అంత ప్రభావాన్ని చూపింది. కాబట్టే బీజేపీని, మోదీని ఇరకాటంలో పెట్టి లబ్ధి పొందవచ్చని సోనియా తాపత్రయం. యూపీఏ ప్రభుత్వంపైకి ఎల్‌కే ఆద్వానీ, మోదీలు సంధించిన అస్త్రాన్నే ఆమె కూడా అందుకున్నారు.

ఏ ఎన్నికల్లోనైనా అన్ని పార్టీలు చేయక తప్పని జపం ఇది. చిత్తశుద్ధికి వస్తే అన్నీ ఒక తానులోని ముక్కలే. మోదీ ప్రభుత్వం నల్లధనం గుట్టు రాబట్టడానికి ‘సిట్’ను ఏర్పాటు చేసిందని ఘనంగా చెప్పుకోన వసరం లేదు. దానికి సుప్రీం కోర్టు విధించిన గడువే  కారణం. ‘విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెన క్కు తెప్పించాల’ని కోరుతూ  2009లో రామ్‌జెఠ్మ లానీ తదితరులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశా రు. ‘ప్రభుత్వం కళ్లుగప్పి విదేశీ బ్యాంకుల్లో డబ్బును అక్రమంగా దాచుకున్న వారి పేర్లను వెల్లడించండి’ అంటూ 2011 జనవరిలో సుప్రీం మధ్యంతర ఉత్త ర్యులను జారీ చేసింది. ప్రభుత్వం తాత్సారం చేస్తుం డటంతో 2011 జూలై 4న కోర్టే ‘సిట్’ను (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దానికి  మాజీ న్యాయమూర్తి జీవన్‌రెడ్డి నేతృ త్వం వహించాలని నిర్దేశించింది.

‘సిట్’కేవలం జీవ న్‌రెడ్డికి మాత్రమే దర్యాప్తు సమాచారాన్ని వెల్లడించాలని జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి, ఎస్‌ఎస్ నిజ్జార్‌లు సూచించారు. (సుప్రీం సూచించే ఇలాంటి నైతిక సూత్రాలను హోంశాఖ కింద పనిచేసే ఏ దర్యాప్తు సంస్థ లేదా బృందం పాటించడం అరుదు). ‘ఇలాంటి నేరాలను అదుపు చేయలేకపోవడం ప్రభుత్వ అసమర్థతగా భావిస్తున్నాం’ అని కోర్టు నిష్కర్షగా పేర్కొంది. ప్రభుత్వం దాన్ని అవమానంగా భావిం చి ‘ఇది ప్రభుత్వ అసమర్థత కిందికి రాదు’ అంటూ అప్పీలుకు వెళ్లింది. ఈలోగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పదవీ విర మణ చేయగా ఆయన స్థానంలో జస్టిస్ అల్తమస్ కబీర్ నియమితులయ్యారు. నిజ్జార్‌కు భిన్నంగా ఆయన ప్రభుత్వ వాదనతో ఏకీభవించ డంతో ‘మూడవ అభిప్రాయం’ కోసం అది పైకి వెళ్లి అక్కడే ఉండిపోయింది.

సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కిం చుకునే ఆశల్లేని సోనియా యూపీఏ ప్రభుత్వం 2014 ఏప్రిల్‌లో స్విట్జర్లాండ్‌లోని ‘లిచ్ టెనిష్టియన్ బ్యాంక్’ ఇచ్చిన 26 మంది పేర్లను సుప్రీం కోర్టుకు అందజేసింది. ఇది రాబోయే ప్రభుత్వాన్ని ఇరకా టంలో పెట్టడానికి వేసిన ఎత్తుగడే. ప్రపంచ అక్రమార్జనాపరుల స్వర్గసీమ స్విట్టర్లాండ్‌లో 312 బ్యాంకులున్నాయి, వాటికి 3,120 శాఖలున్నాయి. వివిధ దేశాల నుండి పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు కోరితే సంబంధిత ఖాతాదారుల వివరాలను వెల్లడించాలనే నిబంధన ఇటీవలి కాలంలో అక్కడ అమల్లోకి వచ్చింది. విదే శాల్లో నల్లధనాన్ని దాచేవారు సాధారణంగా బినా మీల పేర్లతోనే ఖాతాలు తెరుస్తారు. నల్లధనాన్ని వెలికి తీసే ప్రయత్నాలు వేగంగా జరగాల్సి ఉంటుం ది. పూనెకు చెందిన హసన్ ఆలీ ఖాన్ అనే పందెపు గుర్రాల వ్యాపారి పేరు రచ్చకెక్కేటప్పటికే అతగాడు దాచిన డబ్బు అక్కడి నుండి రెక్కలు కట్టుకుని ఎగిరి పోయింది. ఇటీవలి కాలంలో స్విట్జర్లాండ్‌ను తల దన్నేలా సింగపూర్‌లాంటి నల్లధనం కోటలు చాలా నే పుట్టుకొచ్చాయి.  

నల్లధనం వెలికితీతపై ‘సిట్’ ఏర్పాటుకు సుప్రీం తుది గడువు 2014 మే 29. దీంతో మోదీ మే 28 మంత్రివర్గ సమావేశంలో రిటైర్డ్ న్యాయమూర్తి ఎమ్‌బీ షా నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్ జస్టిస్ జీవన్‌రెడ్డి. బీజేపీకి చెందిన రామ్‌జెఠ్మలానీ పిటీషన్ వేసి ఐదేళ్లు నిండాయి. ‘సిట్’ని నియమించాలని సుప్రీం ఆదేశించి మూడేళ్ల యింది. హడావుడిగా ‘సిట్’ను నియమించి ఐదు నెల్లు గడుస్తున్నా దాని అతీ గతీ మోదీకి పట్టలేదు. ఇప్పుడు  సోనియాలాగే ఆయనకు కూడా మహా రాష్ట్ర ఎన్నికల జ్వరం పట్టుకున్నట్టుంది. ఏదో చేస్తు న్నామనిపించుకోవడానికి రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి ప్రతి నిధి బృందాన్ని స్విట్జర్లాండ్‌కు పంపుతున్నట్టు తాజా గా ప్రభుత్వం ప్రకటించింది.

చట్ట విరుద్ద మార్గాల ద్వారా సేకరించిన అక్రమార్జనాపరుల జాబితాలను పరిగణనలోకి తీసుకునేదే లేదని, ఖాతాదారుల వివరాలను వెల్లడించే ప్రసక్తే లేదని ఫిబ్రవరిలో వచ్చిన సమాధానమే వస్తుంది గామోసు. సుప్రీం కోర్టు నల్లధనంపై కొరడా విసరడానికి ముందు స్విట్టర్లాండ్‌లోని మన నల్లధనం 5 లక్షల కోట్ల డాల ర్లు కాగా, ప్రస్తుతం అది 5 వేల కోట్ల డాలర్లకు చిక్కి పోయిందని అంచనా! మిగిలిన ఆ నాలుగు రాళ్లూ ‘సిట్’ దర్యాప్తు చేసి స్వయంగా ఖాతాదార్ల పేర్లు కనిపెట్టేసరికి మిగలవు. నల్లధనం మన ఎన్నికల వ్యవస్థకు ఊపిరిగా ఉన్నంత కాలం దానిపై పోరు ఎన్నికల నినాదంగానే మిగలక తప్పదు.
 
- నన్నూరి వేణుగోపాల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement