ప్రజల యోగక్షేమాలు చూసేది ఎల్‌ఐసీ ఒక్కటే
ప్రజల యోగక్షేమాలు చూసేది ఎల్‌ఐసీ ఒక్కటే
Published Thu, Sep 8 2016 12:38 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
ఆదికవి నన్నయ్యయూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.ముత్యాలనాయుడు
ముగిసిన ఎల్‌ఐసీ బీమా వారోత్సవాలు
ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం) : ప్రజలు యోగక్షేమాలు చూసేది భారతీయ జీవితబీమాసంస్థ(ఎల్‌ఐసీ) ఒక్కటేనని ఆదికవి నన్నయ్య యూనవర్సిటీ వైఎస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.ముత్యాలనాయుడు పేర్కొన్నారు. ఎల్‌ఐసీ డైమండ్‌జూబ్లీ బీమా వారోత్సవాలు ముగింపు వేడుకలు స్థానిక సూర్య గార్డెన్స్‌లో బుధవారం సాయంత్రం సీనియర్ డివిజనల్ మేనేజర్ జే రంగారావు అధ్యక్షతనజరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముత్యాలనాయుడు మాట్లాడుతూ ప్రైవేటు సెక్టార్ల కంటే ప్రభుత్వ సెక్టార్లు మంచిసేవలు అందిస్తున్నాయన్నారు. ఎల్‌ఐసీ సేవాకార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఎల్‌ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ జే రంగారావు మాట్లాడుతూ 60 ఏళ్ల కాలంలో ఎల్‌ఐసీ సాధించిన ప్రగతిని వివరించారు. మార్కెటింగ్ మేనేజర్ ఈఏ విశ్వరూప్, సీఆర్‌ఎం డిప్యూటి మేనేజర్ కె.కేశవరావు మాట్లాడుతూ బీమా వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. యూనియన్ నాయకులు ఎస్.గన్నియ్య ఎల్‌ఐసీ ద్వారా అందిస్తున్న స్కాలర్ షిప్పులు అందుకున్న విద్యార్థులను పరిచయం చేసి వారికి బహమతులను అందజేశారు. వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు, ఎల్‌ఐసీ ఉద్యోగులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులు, ఉద్యోగులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎల్‌ఐసీ ఉన్నతాధికారులు, ఉద్యోగులు,ఏజెంట్లు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement