మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి | Protecting the environment | Sakshi
Sakshi News home page

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి

Published Sat, Jun 7 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

Protecting the environment

 వేలూరు, న్యూస్‌లైన్: పరిశ్రమల ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ నందగోపాల్ తెలిపా రు. వేలూరు జిల్లా రాణిపేటలోని రాణిటెక్ పరిశ్రమలో కలుషిత నీటిని శుభ్ర పరిచే యంత్రాలను ఆయన పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారన్నారు. జిల్లాలో పాలారు సమీపంలోని గ్రామా ల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందన్నారు. రాణిటెక్ పరిశ్రమలో 90 కంపెనీలకు చెందిన కలుషిత నీటి ని శుభ్రం చేసి మరోసారి ఉపయోగించడంతో కొంతవరకు నీటి సమస్యను పరిష్కరించవచ్చన్నారు. జిల్లాలోని పరిశ్రమల్లో మొక్కలు నాటాలన్నారు.
 
మొక్కలు నాటడం ద్వారానే పర్యావరణాన్ని కాపాడ వచ్చన్నారు. మట్టిని పరిశీలించి వాటిలో ఎటువంటి మొక్కలు పెంచాలో తెలుసుకోవాలన్నారు. మొక్కలు పెంచడం ద్వారా మూడేళ్లలో జిల్లా పర్యావరణం చల్లగా ఉంటుం దన్నారు. అనంతరం రాణిటెక్‌లోని డ్రైనేజీ నీటిని శుభ్రం చేసే నూతన వాహనాన్ని కలెక్టర్ ప్రారంభించా రు. కలుషిత నీటిని శుభ్రం చేసే యంత్రాలు, వాటికి ఉపయోగించే కెమికల్ తదితర వాటిని కలెక్టర్ పరిశీ లించి అభినందించారు. రాణిపేట సబ్‌కలెక్టర్ ప్రియదర్శిని, రాణిటెక్ పరిశ్రమ డెరైక్టర్ జబరుల్లా, చైర్మన్ రమేష్ ప్రసాద్, మేనేజర్ శివకుమార్ పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement