ఢిల్లీ: వ్యవసాయ వ్యర్థాలతో ప్రతి రాష్ట్రంలో పెద్ద ఎత్తున.. ఇథనాల్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ 2025 కల్లా పూర్తి చేయాలని చెప్పారు. వాయు కాలుష్యం నివారణకు జాతీయ స్వచ్చ వాయు ప్రణాళిక రూపొందిందన్నారు. శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులతో సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని రైతులతో భేటీ అయ్యారు. ఇథనాల్ ఉత్పత్తి పంపిణీకి పుణె ల్యాబ్ ఈ-100 పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment