సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద వాహన తయారీదారు మారుతి సుజుకి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణతోపాటు, వినియోగదారులకు కూడా ఉచిత ప్రయోజనాలను అందివ్వనుంది. తద్వారా తక్కువ నీటి వినియోగం, పర్యావరణంపై అవగాహన కల్పించనుంది. ఉచిత కాలుష్య చెక్, కాంప్లిమెంటరీ డ్రైవాష్ సౌకరాన్ని అందిస్తోంది. ఈ ఆఫర్ 2019 జూన్ 10 వరకు ఈ ఆఫర్ చెల్లుతుంది.
దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి కారణంగా ప్రధాన నగరాల్లో ఈ చర్య చేపట్టినట్టు తెలిపింది. వాహనాల డ్రై వాష్ ద్వారా 2018-19 ఏడాదిలో సుమారు 656 మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేశామని సుజుకి పేర్కొంది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో నీటి పొదుపు అంశాన్ని తమ వర్క్‌షాపులలో మూడు రెట్లు పెంచినట్టు వెల్లడించింది. తాజాగా బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, పూణే, నాగ్‌పూర్, చెన్నై ఆరు నగరాల్లో వాహనాల డ్రై వాష్ ద్వారా 160 మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేయాలని భావిస్తోంది.
తమ వర్క్‌షాపుల వద్ద డ్రై వాష్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని 18 మిలియన్లకుపైగా ఉన్న వినియోగదారులకు ఆటో మేజర్ విజ‍్ఞప్తి చేసింది. తద్వారా రాబోయే తరాలకోసం నీటిని ఆదా చేయాలని మారుతి సుజుకి ఇండియా సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్థో బెనర్జీ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment