pollution checking
-
ఢిల్లీకి కాలుష్యం కాటు
న్యూఢిల్లీ: బాణసంచాపై నిషేధం ఉన్నా ప్రజలు పట్టించుకోలేదు. కాలుష్యం తీవ్రతకు కరోనా మళ్లీ విజృంభిస్తుందని చెప్పినా వినిపించుకోలేదు. దీపావళి పర్వదినాన అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా టపాసుల మోత మోగుతూనే ఉంది. ఫలితంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. గాలిలో అత్యంత సూక్ష్మ ధూళి కణాలు పీఎం 2.5 కొన్ని ప్రాంతాల్లో 500 దాటి పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2 రోజుల్లో 32% పెరిగిన కాలుష్యం కాలుష్య నియంత్రణ మండలి అంచనాల ప్రకారం పీఎం 2.5 స్థాయి శుక్రవారం నుంచి ఆదివారం మధ్యలో 32 శాతం పెరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలో గాలి నాణ్యతా సూచిలో పీఎం 2.5 స్థాయి 490 వరకు వెళ్లింది. 490 అంటే ఆ గాలిలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్నట్టు లెక్క. ఆ సమయంలో పీల్చిన గాలితో ఆస్తమా వంటి వ్యాధులు తీవ్ర రూపం దాలుస్తాయి. ఈ కాలుష్యంతో కరోనా వైరస్ కూడా విజృంభిస్తోంది. ఢిల్లీలో కాలుష్యాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (ఎస్ఏఎఫ్ఏఆర్) అంచనాల ప్రకారం ఢిల్లీలో ఆదివారం ఉదయం 9 గంటల వేళ పీఎం 2.5 ఏకంగా 545కి చేరుకుంది. ఇలా ఉండగా, ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండటంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ముఖ్యమ్రంతి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ హాజరయ్యారు. -
మారుతి ఆఫర్ : పొల్యూషన్ చెక్, డ్రై వాష్ ఫ్రీ
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద వాహన తయారీదారు మారుతి సుజుకి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణతోపాటు, వినియోగదారులకు కూడా ఉచిత ప్రయోజనాలను అందివ్వనుంది. తద్వారా తక్కువ నీటి వినియోగం, పర్యావరణంపై అవగాహన కల్పించనుంది. ఉచిత కాలుష్య చెక్, కాంప్లిమెంటరీ డ్రైవాష్ సౌకరాన్ని అందిస్తోంది. ఈ ఆఫర్ 2019 జూన్ 10 వరకు ఈ ఆఫర్ చెల్లుతుంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి కారణంగా ప్రధాన నగరాల్లో ఈ చర్య చేపట్టినట్టు తెలిపింది. వాహనాల డ్రై వాష్ ద్వారా 2018-19 ఏడాదిలో సుమారు 656 మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేశామని సుజుకి పేర్కొంది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో నీటి పొదుపు అంశాన్ని తమ వర్క్‌షాపులలో మూడు రెట్లు పెంచినట్టు వెల్లడించింది. తాజాగా బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, పూణే, నాగ్‌పూర్, చెన్నై ఆరు నగరాల్లో వాహనాల డ్రై వాష్ ద్వారా 160 మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేయాలని భావిస్తోంది. తమ వర్క్‌షాపుల వద్ద డ్రై వాష్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని 18 మిలియన్లకుపైగా ఉన్న వినియోగదారులకు ఆటో మేజర్ విజ్ఞప్తి చేసింది. తద్వారా రాబోయే తరాలకోసం నీటిని ఆదా చేయాలని మారుతి సుజుకి ఇండియా సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్థో బెనర్జీ కోరారు. -
ఆరంభ శూరత్వమేనా?
సాక్షి, సిటీబ్యూరో: రవాణాశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన ఆన్లైన్ పొల్యూషన్ టెస్టింగ్ ఆరంభశూరత్వమే అయింది. విషం చిమ్ముతున్న వాహనాలకు కళ్లెం వేసేందుకు పారదర్శకమైన పరీక్ష విధానానికి ప్రతిపాదనలు రూపొందించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కాలుష్య ప్రమాణాలను నిర్ధారించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. గతేడాది ఇందుకోసం అర్హత కలిగిన సాంకేతిక సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. దీనికోసం కొన్ని సంస్థలు పోటీపడ్డాయి. కానీ ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేకుండాపోయింది. సాంకేతిక సంస్థల ఎంపిక ఆదిలోనే నిలిచిపోయింది. నగరంపై విషం చిమ్ముతున్న వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రస్తుతం మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ సెంటర్లను వినియోగిస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఎలాంటి శాస్త్రీయతకు అవకాశం లేదనే ఆరోపణలున్నాయి. కచ్చితమైన అంచనా వాహన కాలుష్యాన్ని కచ్చితంగా నిర్ధారించి ధ్రువీకరణ పత్రాలను అందజేసేందుకు ఆన్లైన్ వ్యవస్థ దోహదం చేస్తుంది. వాహనాల్లోంచి వెలువడే పొగలో ఏ రకమైన కాలుష్య కారకాలు ఏ స్థాయిలో ఉన్నాయో శాస్త్రీయంగా నిర్ధారించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తగా ప్రతిపాదించిన పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్లు పని చేస్తాయి. వాహనాలకు అక్కడే పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు. ఒకవేళ కాలుష్య కారకాలు అతిగా వెలువడితే వాహనానికి మరమ్మతులు సూచిస్తారు. అప్పటికే దాని జీవితకాలం ముగిసినట్లుగా తేలితే ఆ వాహనాన్ని పక్కనపెడతారు. సదరు వాహనదారులు కూడా వాటిని వినియోగించకుండా చర్యలు తీసుకుంటారు. ఇలా ఏర్పడిన స్టేషన్లకు, మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ కేంద్రాలను ఆన్‌లైన్‌తో అనుసంధానం చేసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కాలుష్య నియంత్రణ చర్యలు చేపడతారు. ఈ వ్యవస్థ రవాణా కమిషనర్ కార్యాలయంలోని ప్రధాన సర్వర్‌తో అనుసంధానమై ఉంటుంది. వాహనాల కాలుష్య కారకాల మోతాదులను ఇక్కడి నుంచే నిర్దేశించి ధ్రువీకరణ పత్రాలను అందజేయాలనేది ఆన్లైన్ పొల్యూషన్ టెస్టింగ్ కేంద్రాల ఏర్పాటు లక్ష్యం. కాలుష్యం నుంచి ఊరట.. ప్రస్తుతం నగరంలో సుమారు 350 వరకు మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ కేంద్రాలు ఉన్నాయి. కానీ వీటి ద్వారా నిర్వహించే తనిఖీల్లో ఎలాంటి ప్రామాణికత, శాస్త్రీయత లేదు. వాహనాల నుంచి వెలువడే పొగలోని కాలుష్యకారక పదార్థాలను అంచనా వేసి సర్టిఫికెట్లను అందజేసే కాలుష్య తనిఖీ కేంద్రాలు ఉత్తుత్తి పరీక్షలతో కాసులు పండించుకుంటున్నాయి. రోడ్డుపై అక్కడక్కడా దర్శనమిచ్చే ఈ మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్లు వాహనదారులను నిలిపి పరీక్షలు నిర్వహిస్తాయి. కాలుష్య నియంత్రణలో ఆ వాహనం ఎలాంటి ప్రమాణాలను అనుసరించేదీ ధ్రువీకరిస్తారు. ఈ టెస్టింగ్ స్టేషన్లు అందజేసే ధ్రువీకరణ పత్రాలనే రవాణా శాఖ ప్రాతిపదికగా భావిస్తోంది. ఇలాంటి కీలకమైన అంశంలో టెస్టింగ్ స్టేషన్లలో సింహభాగం ఎలాంటి పరీక్షలు లేకుండానే వాహనదారులకు ధ్రువీకరణ పత్రాలను అందజేస్తున్నాయి. అతి ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ వంటి పదార్థాలను వెలువరించే వాహనాలకు సైతం ఈ స్టేషన్లు పచ్చజెండా ఊపుతున్నాయి. ఆధునిక మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్ల వల్ల ఇలాంటి తప్పుడు పరీక్షలకు అవకాశం లేకుండా పోతోంది. ఆగిన ప్రక్రియ.. సాంకేతిక సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించడంతో ఆరు సంస్థలు పోటీపడ్డాయి. కానీ ఎంపిక నాటికి ఎన్నికల ప్రక్రియ ముందుకొచ్చింది. దీంతో అధికారులు వెనకడుగు వేశారు. తిరిగి ఎలాంటి కదలిక లేకుండాపోయింది. టెండర్ల కాలపరిమితి ముగిసింది. ఈ ప్రతిపాదన ముందుకు సాగాలంటే మరోసారి టెండర్లను ఆహ్వానించాలి. ఇందుకోసం ప్రభుత్వం మరోసారి నిర్ణయం తీసుకోవాలి. అప్పటి వరకు అనిశ్చితి తప్పదని రవాణాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు. -
లేటెస్ట్ పొల్యూషన్ టెస్ట్
సాక్షి, సిటీబ్యూరో: వాహన కాలుష్యాన్ని కచ్చితంగా నిర్థారించి ధృవీకరణ పత్రాలు అందజేసేందుకు రవాణాశాఖ అధునాతన కాలుష్య తనిఖీ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వాహనాల నుంచి వెలువడే పొగలో ఏ రకమైన కాలుష్య కారకాలు.. ఏ స్థాయిలో ఉన్నాయో శాస్త్రీయంగా నిర్థారించే సాంకేతిక పరిజ్ఞానం ఈ స్టేషన్లలో ఉంటుంది. మొదట రవాణాశాఖ ప్రధాన కార్యాలయం ఖైరతాబాద్‌లోను, బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయంలోను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నారు. వాహనాలకు అక్కడే పరీక్షలు చేసి ధ్రువ పత్రాలను అందజేస్తారు. ఒకవేళ కాలుష్య కారకాలు అతిగా వెలువడితే వాహనానికి మరమ్మతులు సూచిస్తారు. అప్పటికే దాని జీవితం కాలం ముగిస్తే సదరు వాహనాన్ని పక్కన పెట్టేస్తారు. ఆ వాహనదారులు కూడా వాటిని వినియోగించకుండా చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం నగరంలో ఏర్పాటు చేసిన అధునాతన సిటీ బస్టాప్‌ల తరహాలోనే కాలుష్య తనిఖీ కేంద్రాలను (పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్స్)ను కూడా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యలో పెట్రోల్ బంకులు, ఇతర కేంద్రా లకు విస్తరించి నిర్వహించాలని యోచిస్తున్నట్టు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ ‘సాక్షి’తో చెప్పారు. ఖైరతాబాద్, బండ్లగూడ స్టేషన్ల ఫలితాలను పరిశీలించి ఆ తరువాత అన్ని చోట్లకు వీటిని విస్తరిస్తామన్నా రు. ఇలా ఏర్పడిన స్టేషన్లకు, మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ కేంద్రాలను ఆన్‌లైన్‌తో అనుసంధానం చేసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నగరంలో ఏర్పాటు కానున్న వాహన కాలుష్య నియంత్రణ వ్యవస్థ మొత్తంగా రవాణా కమిషనర్ కార్యాలయంలోని ప్రధాన సర్వర్‌తో అనుసంధానమై ఉంటుంది. వాహనాల కాలుష్య కారకాల మోతాదులను ఇక్కడి నుంచే నిర్దేశించి ధృవీకరణ పత్రాలను అందజేస్తారు. నియంత్రణ లేని కాలుష్యం నుంచి ఊరట.. ప్రస్తుతం నగరంలో సుమారు 350 వరకు మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ కేంద్రాలు, పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్లు ఉన్నాయి. కానీ వీటి ద్వారా నిర్వహించే తనిఖీల్లో ఎలాంటి ప్రామాణికత, శాస్త్రీయత లేదు. వాహనాల నుంచి వెలువడే పొగలోని కాలుష్య కారక పదార్థాలను అంచనా వేసి సర్టిఫికెట్లను అందజేసే కాలుష్య తనిఖీ కేంద్రాలు ఉత్తుత్తి పరీక్షలతో కాసులు పండించుకుంటున్నాయి. దీంతో ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా పరిణమించిన వాహన కాలుష్యాన్ని నియత్రించాలనే ఉన్నతమైన లక్ష్యం పక్కదారి పడుతోంది. రోడ్డుపైన అక్కడక్కడా దర్శనమిచ్చే ఈ మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్లు వాహనదారులను నిలిపి పరీక్షలు చేస్తాయి. కాలుష్య నియంత్రణలో ఆ వాహనం ఎలాంటి ప్రమాణాలను అనుసరించేదీ ధృవీకరిస్తారు. ఈ టెస్టింగ్ స్టేషన్లు అందజేసే ధృవీకరణ పత్రాలనే రవాణాశాఖ ప్రాతిపదికగా భావిస్తుంది. ఇలాంటి కీలకమైన అంశంలో టెస్టింగ్ స్టేషన్లలో సింహభాగం ఎలాంటి పరీక్షలు లేకుండానే వాహనదారులకు ధృవీకరణ పత్రాలను అందజేస్తున్నాయి. అతి ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ వంటి పదార్థాలను వెలువరించే వాహనాలకు సైతం ఈ స్టేషన్లు పచ్చ జెండా ఊపుతున్నాయి. ఆధునిక మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్ల వల్ల ఇలాంటి తప్పుడు పరీక్షలకు అవకాశం ఉండదు. ప్రజలకు వాహన కాలుష్యం నుంచి ఊరట లభిస్తుంది. నిర్థారణ ఇలా చేయాలి.. ⇔ ప్రస్తుతం ఉన్న మొబైల్ టెస్టింగ్ స్టేషన్లలో గ్యాస్ అనలైజర్లు, స్మోక్ మీటర్ల సహాయంతో వాహనం నుంచి వెలువడే పొగ సాంధ్రత, దానిలోని కార్బన్ మోనాక్సైడ్, హైడ్రో కార్బన్, మీథెన్ స్థాయిని అనలైజర్ల సహాయంతో నిర్థారిస్తారు. ⇔ స్మోక్ మీటర్ సహాయంతో పొగ సాంధ్రతను నిర్థారిస్తారు. ఇది వాహనం సాధారణంగా ఉన్నప్పుడు 65 హార్ర్‌టిజింగ్ యూనిట్స్, రైజింగ్‌లో ఉన్నప్పుడు 75 హార్ర్‌టిజింగ్ యూనిట్స్ ఉంటుంది. ఈ ప్రమాణాలను అధిగమించి తిరిగే వాహనాలన్నీ ప్రమాదకరమైన కాలుష్యాన్ని వెదజల్లుతున్నట్లే. ⇔ కార్బన్ మోనాక్సైడ్ 0.5 శాతం, హైడ్రోకార్బన్ 750 పీపీఎం (పార్ట్స్ ఫర్ మిలియన్) చొప్పున ఉండాలి. ఈ ప్రమాణాల కంటే ఎక్కువ ఉండే వాహనాలన్నీ కాలుష్య కారక వాహనాల కిందే లెక్క. ⇔ కానీ ఆటో మొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) నిర్దేశించిన ఈ ప్రమాణాలను నగరంలోని మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్లు పాటించడం లేదు. ⇔ రవాణాశాఖ ఈ పత్రాలనే ప్రాణికంగా పాటిస్తోంది. దీంతో చట్టాల దారి చట్టాలది. కాలుష్యం దారి కాలుష్యానికి అన్నట్లుగా మారింది. -
పొల్యూషన్ చెకింగ్ వాహనాన్ని ఢీకొన్న బైక్
రంగారెడ్డి(ఉప్పల్): పొల్యూషన్ చెకింగ్ వాహనాన్ని మల్లాపూర్ వద్ద ఓ బైక్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు, యువతి తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమించటంతో 108లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిద్దరూ స్పృహలో లేకపోవడం వల్ల పూర్తి వివరాలు తెలియరాలేదు. నాచారం నుండి ఎన్ఎఫ్సీ వైపు బైక్ మీద వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడి వారు తెలిపారు.