
చెన్నై : తమిళనాడు ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అంటే 2019 జనవరి 1 నుంచి పూర్తిగా తమ రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి నేడు (సోమవారం)ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేయడం, వాడటం అన్నీ నిషేధమే.
‘తమిళనాడు 2019 నుంచి ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రారంభిస్తుంది’ అని పళనిస్వామి రాష్ట శాసన సభలో ప్రకటించారు. పాలు, ఆయిల్ పౌచ్‌లు, మెడికల్ యుటిలిటీస్, ఇతర ప్రాథమిక ఉత్పత్తులకు ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపారు. రూల్ 110 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గుజరాత్ కూడా ప్రజా రవాణా మార్గాలు, గార్డెన్లు, ప్రభుత్వ ఆఫీసుల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నేటి నుంచి నిషేధిస్తున్నట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment