
మాజీ ఎమ్మెల్యే కన్నబాబుకు నివాళి
అనకాపల్లి : మాజీ ఎమ్మెల్యే శ్రీ రాజా వత్సవాయి వెంకట పతిరాజు బహుదూర్ (కన్నబాబు) ఆదివారం అనకాపల్లిలోని స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని పట్టణ ప్రముఖులు కడిమిశెట్టి రాంజీ, డాక్టర్ నారాయణరావు, బుద్ద నాగజగదీశ్వరావు, టీడీపీ నాయకులు, ఎన్టీఆర్ ఫాన్స్ వెంకటేశ్వరావు, సత్తిబాబు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అయ్యన్న సంతాపం : అనకాపల్లి మాజీ ఎమ్మెల్యేల రాజా కన్నబాబు మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో కన్నబాబు విజయం సాధించి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసి ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు.