
సాక్షి, అమరావతి: మార్కెటింగ్ శాఖ అధికారులతో మంత్రి కన్నబాబు శుక్రవారం రోజున సమీక్ష నిర్వహించారు. కోవిడ్ దృష్ట్యా మామిడి, టమాట మార్కెట్లపై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పండ్ల ధరలపై దృష్టి పెట్టామని మంత్రి కన్నబాబు తెలిపారు. రైతులు మార్కెట్లలోకి రాత్రులు కూడా సరుకులు తీసుకురావచ్చునని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. అంతేకాకుండా మార్కెట్ల నుంచి తిరిగి వెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని మంత్రి అధికారులకు సూచించారు. మామిడి ధరలను రోజూ పర్యవేక్షించాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు తెలిపారు.
టమాట ధరలు పడిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల టన్నుల టమాటలను ప్రాసెసింగ్ యూనిట్స్ కొలుగోలు చేసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. రైతు బజార్లలో మాస్క్ లేకుండా వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ‘నో మాస్క్ - నో ఎంట్రీ విధానం’ అమలులో ఉంటుందని మంత్రి కన్నబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment