అక్రమ ఇళ్ల నిర్మాణాలపై విశాఖ అధికారులు కొరడా ఝులిపించారు. అక్రమ నిర్మాణాలపై ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు యలమంచిలి కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నబాబుకు షాకిచ్చింది. నగరంలోని అక్రమ నిర్మాణలకు ఎమ్మెల్యే పాల్పడినట్టు ట్రిబ్యునల్ తప్పపట్టింది.
అక్రమంగా నిర్మించిన ఇంటిని జూన్ 29లోగా ఖాళీ చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ట్రిబ్యునల్ తీర్పుపై ఎమ్మెల్యే కన్నబాబు ఇంకా ఏమి స్పందించలేదు.
ఇటీవల ఓ ప్రయివేటు కేసుకు సంబంధించి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై పోలీసు అధికారులతో పాటు ఎమ్మెల్యే కన్నబాబు, మరో ఇద్దరు పట్టు పరిశ్రమ ఉద్యోగులు మొత్తం 8మందిపై కేసులు నమోదు చేయాలని విశాఖ జిల్ఆ పాడేరు కోర్టు న్యాయమూర్తి నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వివాదంతోపాటు తాజాగా ఎండోమెంట్ ట్రిబ్యునల్ తీర్పుతో యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు మరో వివాదంలో చిక్కుకున్నారు.