అనకాపల్లిలోని మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం | Production Manager Died In Admiron Life Sciences At Parawada, Check More Details Of This Incident | Sakshi
Sakshi News home page

అనకాపల్లిలోని మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం

Published Thu, Sep 12 2024 1:11 PM | Last Updated on Thu, Sep 12 2024 1:53 PM

Production Manager Died In Admiron Life Sciences At Parawada

అనకాపల్లి జిల్లా,సాక్షి : అనకాపల్లి జిల్లా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఉద్యోగి అనుమాస్పద స్థితిలో శవమై తేలాడు. దీంతో ఉద్యోగి అదృశ్యం కాస్త విషాదంగా మారింది. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్‌లో రండి సూర్యనారాయణ ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల విధులు నిర్వహించేందుకు వెళ్లిన సూర్యనారాయణ ఇంటికి రాకపోవడంపై ఆతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కంపెనీ స్టోరేజీ ట్యాంక్‌ సూర్యనారాయణ డెడ్‌బాడీ బయటపడడం పలు అనుమానాలకు తావిస్తుంది.

ఉత్తరాంధ్రాలో ఫార్మా కంపెనీ పేరు చెబితేనే ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గత ఆగస్ట్‌ నెలలో అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీలో ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా, అడ్మిరాన్‌ లైఫ్‌ సైన్సెస్‌లో ప్రమాదంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement