సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లలో వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎం కేసీఆర్ మీడియా ముందు ఫుటేజ్ పెట్టడంపై అభ్యంతరం తెలుపుతూ కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్ సహా పలువురు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ డివైజెస్ అంశంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. పిటిషనర్లు 65బీ సర్టిఫికెట్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపింది. సీఎం మీడియో సమావేశానికి సంబంధించి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎక్కడి నుంచి తీసుకున్నారని పిటిషనర్లను న్యాయమూర్తి ప్రశ్నించారు. 65బీ ఇచ్చేందు కు సమయం కావాలని కోరడంతో.. సాయంత్రం 4.30 గం. వరకు న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను సాయంత్రం వరకు వాయిదా వేశారు.
పిటిషనర్లు ఇచ్చిన ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకోలేం..
ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలని చట్టంలో లేదని హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది జోగినపల్లి సాయికృష్ణ వాదించారు. యూట్యూబ్ నుంచి డౌన్‌లోడ్ చేసి తీసుకొని వచ్చిన వీడియోను ఎవిడెన్స్‌గా పరిగణించలేమని చెప్పారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 65బీ ప్రకారం సర్టిఫికెట్ లేకుండా ఎవిడెన్స్‌ను రికార్డుల్లోకి తీసుకోవడానికి వీలులేదని చెప్పారు. అసలు సీబీఐకి ఈ కేసును బదిలీ చేయాలి అనడానికి.. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌కు సంబంధం లేదన్నారు.
ఇలాంటి ఎవిడెన్స్‌ను ట్రయల్ కోర్టులో మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని నివేదించారు. రోహిత్‌రెడ్డి ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ట్రాప్ చేసి.. నిందితులను అరెస్టు చేశారని చెప్పారు. అక్టోబర్ 26న ముఖ్యమంత్రి మీడియా భేటీ నిర్వహించగా, నవంబర్ 9న సిట్ ఏర్పాటు జరిగిందని కోర్టుకు దృష్టికి తేచ్చారు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ మెటీరియల్ ఎలా ఇచ్చిందో చెప్పాలని పిటిషనర్లను ప్రశ్నించారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కు అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీని కోసం సాయంత్రం 4.30 గంటల వరకు న్యాయమూర్తి సమయం ఇచ్చారు. సాయంత్రం వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును రిజర్వు చేశారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు
Comments
Please login to add a commentAdd a comment