సిక్కు వేర్పాటువాది, ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యోదంతం ఒక్కసారిగా భారత్, కెనడా దౌత్యసంబంధాల్లో మంటలు రాజేసింది. నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సి ఉందంటూ ఆదివారం భారత విదేశాంగ శాఖకు కెనడా సందేశం పంపింది. ఇక.. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించింది. అంతేకాకుండా కెనడా నుంచి దౌత్యాధికారులను భారత్ వెనక్కి రప్పిస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో స్పందించారు. కెనడాలో నేర కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా భారత ప్రభుత్వం.. ప్రాథమిక తప్పు చేసిందని ఆరోపించారు. ఒట్టావాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను ఎత్తిచూపారు. సింగపూర్‌లో ఈ వారాంతంలో షెడ్యూల్ చేయబడిన జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ప్రాముఖ్యతను తెలిపారు. గత వారం చివరలో నేను భారత ప్రధాని మోదీతో మాట్లాడిన సమయంలో ఈ వారాంతంలో సింగపూర్‌లో జాతీయ భద్రతా సలహాదారుల ముఖ్యమైన సమావేశం జరగబోతోందని తెలిపారు. ఆ సమావేశం గురించి మోదీకి కూడా తెలుసు. అయితే ఆ సమావేశం అవసరమని నేను తెలియజేశా. అదేవిధంగా ఈ సమావేశాన్ని చాలా చాలా సీరియస్‌గా తీసుకోవాలని అన్నాను.
#WATCH | Ottawa: Canadian PM Justin Trudeau says, "When I spoke to PM Modi at the end of last week, I highlighted how incredibly important meeting between our national security advisors in Singapore this weekend was going to be. He was aware of that meeting and I pressed upon him… pic.twitter.com/RvKMN2Trzg
— ANI (@ANI) October 14, 2024
..కెనడియన్ గడ్డపై, హత్య, దోపిడీ పాటు, కెనడియన్లకు వ్యతిరేకంగా నేర కార్యకలాపాలకు మద్దతు ఇవ్వగలమని భావించడంలో భారత ప్రభుత్వం ప్రాథమిక తప్పు చేసింది. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు.అయితే.. ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్‌తో కలిసి పనిచేయడానికి కెనడా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇరుదేశాల మధ్య ఘర్షణ సృష్టించటం కెనడా ఉద్దేశం కాదు. భారతదేశం ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్య దేశం. భారత్‌తో కెనడాకు వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నాం.
.. అందుకే మేము ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ద్వారా హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఉందా లేదా అనే విషయంపై విచారణ ప్రారంభించాం. నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉన్నట్లు మాకు తెలుసు. ఈ విషయంలో పరిష్కరించటంలో భారత్ మాతో కలిసి పని చేయాలి. మేము ఈ పోరాటం చేయవద్దని అనుకుంటున్నాం. కానీ కెనడియన్ గడ్డపై ఓ వ్యక్తిని చంపటం ఒక దేశంగా మేము విస్మరించలేని విషయం’’ అని అన్నారు.
చదవండి: భగ్గుమన్న దౌత్య బంధం
Comments
Please login to add a commentAdd a comment