పాక్‌తో దౌత్యం ఆగ లేదు | India will not block sick Italian marine's treatment: Sushma Swaraj | Sakshi
Sakshi News home page

పాక్‌తో దౌత్యం ఆగ లేదు

Published Tue, Sep 9 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM

పాక్‌తో దౌత్యం ఆగ లేదు

పాక్‌తో దౌత్యం ఆగ లేదు

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో దౌత్య సంబంధాలు ఆగిపోలేదని, చర్చల ప్రక్రియ కొనసాగే అవకాశాలున్నాయని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. చర్చలకు  విఘాతం కలగడానికి పాక్ వైఖరే కారణమన్నారు. ఈ నెలలో  ఐక్యరాజ్యసమితి సాధారణ సభ భేటీ కానున్న  నేపథ్యంలో ప్రధాని మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య సమావేశానికి అవకాశాలు లేకపోలేదన్నారు. విదేశాంగ మంత్రిగా వందరోజుల పదవీ బాధ్యతల నిర్వహణపై నివేదిక విడుదల సందర్భంగా ఆమె సోమవారం వివిధ అంశాలపై మాట్లాడారు. కాశ్మీర్ వేర్పాటువాదులతో పాక్ చర్చలు జరపడంలో ఔచిత్యంలేదన్నారు. పాక్‌తో దౌత్యం విషయంలో ’కామా’లు, ’సెమీకోలన్’లు ఉంటాయే తప్ప ’ఫుల్‌స్టాప్’ ఉండదన్నారు.

జిల్లాకో పాస్‌పోర్ట్ కేంద్రం..: దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పాస్‌పోర్ట్ కేంద్రాలు ఏర్పాటుచేయాలనుకుంటున్నట్టు సుష్మ చెప్పారు.  వచ్చే నెల 31నాటికి 33జిల్లాల్లో పాస్‌పోర్ట్ కేంద్రాలు ఏర్పాటవుతాయని, త్వరలో ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలో పాస్‌పోర్ట్ కేంద్రాలు రాబోతున్నాయని సుష్మా స్వరాజ్ చెప్పారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement