న్యూఢిల్లీ: భారత్, దక్షిణకొరియాల సంబంధం పరస్పర గౌరవం, ఉమ్మడి విలువల ఆధారంగా మరింత బలపడుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘భారత్, దక్షిణ కొరియాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి నేటితో 50 ఏళ్లు పూరయ్యాయి.
ఇది పరస్పర గౌరవం, ఉమ్మడి విలువలు, పెరుగుతున్న భాగస్వామ్యాలు కలగలిసిన ప్రయాణం’అని ఆయన పేర్కొన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు ఆయనతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య ఏర్పడిన సంబంధాలకు 50 ఏళ్లయిన సందర్భంగా ఆయన ఆదివారం ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment