
నేడు సింగపూర్‌కు సుష్మాస్వరాజ్!
ఈ నెలలోనే నలుగురు సీఎంలు కూడా
న్యూఢిల్లీ: ఈ నెలలో సింగపూర్‌కు ‘ఉన్నతస్థాయి’ పర్యాటకుల తాకిడి గణనీయంగా ఉండనుంది. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ నేడు(శుక్రవారం) సింగపూర్‌కు వెళ్తున్నారు. సింగపూర్‌తో దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించనున్న ఉత్సవాలు ప్రారంభోత్సవంలో సుష్మ పాల్గొంటారు.
సుష్మ పర్యటన అనంతరం.. పశ్చిమబెంగాల్, రాజస్తాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ముఖ్యమంత్రులు వరుసగా మమత బెనర్జీ, వసుంధరా రాజే, కే చంద్రశేఖర్ రావు, చంద్రబాబు నాయుడులు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు.