న్యూఢిల్లీ: సింగపూర్‌కు ‘ఉన్నతస్థాయి’ పర్యాటకుల తాకిడి గణనీయంగా పెరుగుతోంది. భారతదేశ విదేశాంగ మంత్రి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సింగపూర్‌లో పర్యటించనున్నారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ శుక్రవారం సింగపూర్‌కు వెళ్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆమె ఆ దేశ ప్రధానమంత్రి లీ సీన్, విదేశాంగమంత్రి కే షన్ముగంలతో చర్చలు జరుపుతారు. సింగపూర్‌తో దౌత్య సంబంధాలకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంవత్సరం పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుష్మా పాల్గొంటారు.
సుష్మ పర్యటన అనంతరం.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,రాజస్థాన్ ముఖ్యమంత్రులు వసుంధరా రాజేలు సింగపూర్ కు బయల్దేరి వెళ్లనున్నారు.