21, 22 తేదీల్లో పోలండ్ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 23న ఉక్రెయిన్‌కు వెళ్లనున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఆ దేశాధ్యక్షుడు వొలోదిమియర్ జెలెన్‌స్కీతో చర్చలు జరుపుతారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత 30 ఏళ్లలో భారత ప్రధాని ఉక్రెయిన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.
రైలులో కీవ్‌కు ఉక్రెయిన్ కంటే ముందు మోదీ పోలండ్‌కు వెళతారు. ఈనెల 21, 22 మోదీ పోలండ్‌లో పర్యటిస్తారు. పోలండ్ సరిహద్దుల్లో గల ఒక స్టేషన్ నుంచి రైలులో ప్రయాణించి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చేరుకుంటారు. ఇది దాదాపు 10 గంటల ప్రయాణం. తిరుగు ప్రయాణంలోనూ మోదీ రైలు ద్వారానే పోలండ్‌కు వస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సహా పలువురు నేతలు ఉక్రెయిన్ పర్యటనకు రైలు మార్గాన్నే ఎంచుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment