దౌత్య కార్యాలయాలపై దాడులు.. 43 మందిని గుర్తించిన ఎన్‌ఐఏ | Probe Agency NIA Identifies 43 Suspects In Attack On Indian Missions | Sakshi
Sakshi News home page

దౌత్య కార్యాలయాలపై దాడులు.. 43 మందిని గుర్తించిన ఎన్‌ఐఏ

Published Sun, Dec 31 2023 9:22 PM | Last Updated on Sun, Dec 31 2023 9:23 PM

Probe Agency NIA Identifies 43 Suspects In Attack On Indian Missions - Sakshi

ఢిల్లీ: అమెరికా, యూకే, కెనడాలోని భారత రాయబార కార్యాలయాలపై ఇటీవల జరిగిన దాడుల్లో 43 మంది అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) గుర్తించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ఆదేశాల మేరకు ఈ ఏడాది అమెరికా, యూకే, కెనడాలోని భారత దౌత్య కార్యాలయాలపై దాడుల కేసును జూన్‌లో ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది.  

ఈ ఏడాది మార్చి 19న లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తానీ వర్గాలు రెండు వేర్వేరు దాడులకు పాల్పడ్డాయి. జూలై 2న శాన్ ఫ్రాన్సిస్కోలో ఇలాంటి దాడులు జరిగాయి. ఈ ఏడాది ఆగష్టులో శాన్ ఫ్రాన్సిస్కోను ఎన్‌ఐఏ బృందం సందర్శించింది. మార్చి 2023లో కెనడా, శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన దాడులకు సంబంధించి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కూడా చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. 

ఈ కేసులో భారతదేశంలో ఇప్పటివరకు 50 చోట్ల దాడులు నిర్వహించామని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. దాడులకు సంబంధించి సుమారు 80 మందిని  విచారించారని సమాచారం.   

ఇదీ చదవండి: రామ మందిర విరాళాల పేరిట నకిలీ క్యూఆర్ కోడ్.. వీహెచ్‌పీ అలర్ట్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement