ఐదేళ్లలో 633 మంది భారతీయ విద్యార్థుల మృతి | 633 Indian students died abroad in 5 years says centre | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలో 633 మంది భారతీయ విద్యార్థుల మృతి

Published Mon, Jul 29 2024 6:45 PM | Last Updated on Mon, Jul 29 2024 7:24 PM

633 Indian students died abroad in 5 years says centre

న్యూఢిల్లీ:  గత అయిదేళ్లలో విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 633 మంది మరణించారు. కెనడా, అమెరికాలో మరణాల సంఖ్య అత్యధికంగా నమోదయ్యాయి. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా కేరళ ఎంపీ కొడికున్నిల్ సురేష్ శుక్రవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సోమవారం సమాధానమిచ్చారు.

2019 నుంచి విదేశాల్లో  వివిధ ఉన్నత విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న 633 మంది భారతీయ విద్యార్థులు మరణించినట్లు తెలిపారు. ఈ మరణాలు 41 దేశాల్లో జరగ్గా.. కెనడాలో అత్యధికంగా 172 మంది, అమెరికాలో 108 మంది భారతీయ విద్యార్ధులు ప్రాణాలు విడిచినట్లు పేర్కొన్నారు. కెనడా, యూఎస్‌ తరువాత, అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో యూకే (58), ఆస్ట్రేలియా (57), రష్యా (37), జర్మనీ (24)  ఉన్నాయి. పొరుగున ఉన్న పాక్‌లోనూ ఒకరు మరణించారు.

అయితే వీరంతా ప్రమాదాలు, వైద్య పరిస్థితులు, దాడులు వంటి వివిధ కారణాల వల్ల  చనిపోయినట్లు చెప్పారు. దీనికితోడు విదేశాల్లో జరిగిన దాడుల్లో 19 మంది మరణించగా.. అత్యధికంగా తొమ్మిది మంది కెనడాలో, ఆరుగురు అమెరికాలో  ప్రాణాలు విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు.

అయితే విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు భద్రత కల్పించడం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతలలో ఒకటని అన్నారు. గత మూడేళ్లలో 48 మంది భారతీయ విద్యార్థులను అమెరికా నుంచి బహిష్కరించినట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు. వారి బహిష్కరణకు గల కారణాలను అమెరికా అధికారులు అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు.

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement