Missions
-
సరిహద్దుల్లో పేలనున్న సిటీ తుపాకీ
సాక్షి, హైదరాబాద్: భారత సరిహద్దుల్లో కాపుకాసే ఆర్మీ జవాన్ల చేతిలో ‘సిటీ తుపాకీ’ పేలనుంది. ‘అస్మి’ పేరుతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీర్డీఓ) డిజైన్ చేసిన ఈ మొట్టమొదటి భారతీయ సబ్ మెషీన్‌గన్ తయారీ కాంట్రాక్టును హైదరాబాద్‌కు చెందిన లోకేశ్ మిషన్స్ లిమిటెడ్ దక్కించుకుంది. తొలి విడతలో ఆర్మీ నార్తర్న్ కమాండ్ కోసం రూ.4.26 కోట్లతో 550 తుపాకులు తయా రు చేసి సరఫరా చేయనున్నారు. ఇజ్రాయెల్, జర్మనీల్లోని ఆయుధ కర్మాగారాలకు దీటుగా నగరానికి చెందిన ఓ చిన్న సంస్థ ఈ ప్రతి ష్టాత్మక కాంట్రాక్టు దక్కించుకోవడం గమనార్హం. ఈ తుపాకీని సరిహద్దు భద్రతా దళాలతో పాటు కేంద్ర పోలీసు బలగాలూ వినియోగించనున్నాయి. ప్రముఖుల భద్రత కోసం వినియోగించడానికీ ‘అస్మి’ అనువుగా ఉంటుంది.ఉజీ, హెక్లర్లకు దీటుగా..⇒ పుణేలోని డీఆర్డీఓలో అంతర్భాగమైన అర్మా మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఆర్మీ సంయుక్తంగా ఆత్మనిర్భర్ భారత్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పరిశోధనతో ‘అస్మి’ రూపుదిద్దుకుంది. నాగ్‌పూర్‌కు చెందిన లెఫ్ట్‌నెంట్ కల్నల్ ప్రసాద్ బన్సోద్ దీన్ని డిజైన్ చేశారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) ప్రమాణాలకు లోబడి, దేశీయ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేశారు. సంస్కృతంలో అస్మిత అంటే ధైర్యం, గర్వం (ప్రైడ్) అని అర్థం. దీన్ని సంక్షిప్తీకరించిన ప్రసాద్ ఈ తుపాకీకి ‘అస్మి’ అని పేరు పెట్టారు. అంతర్జాతీ యంగా ప్రసిద్ధి చెందిన ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ తయారు చేసే ఉజీ, జర్మనీలో తయా రయ్యే హెక్లర్, కోచీ ఎంపీ–5 ఆయుధాలకు దీటుగా ‘అస్మి’ పని చేస్తుందని డీఆర్డీఓ ప్రకటించింది.అంతర్జాతీయ పోటీని తట్టుకుని..హైదరాబాద్‌లోని బాలానగర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే లోకేశ్ మిషన్స్ లిమిటెడ్ సంస్థ చిన్న పరిమాణంలో ఆయుధాలు తయారు చేస్తుంది. అయితే అంతర్జాతీయ పోటీని తట్టుకున్న ఈ సంస్థ ‘అస్మి’ తయారీ కాంట్రాక్టు దక్కించుకుంది. ఇప్పటికే పది చొప్పున తుపాకులు తయారు చేసి ఆర్మీతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ), అసోం రైఫిల్స్‌కు అందించింది. నాణ్యతపై వాళ్లు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడంతో తొలి విడతలో ఆర్మీ నార్తర్న్ కమాండ్ 550 తుపాకుల తయారీకి ఆర్డర్ ఇచ్చింది.ఈ ఏడాది సెప్టెంబర్ 28 నాటికి వీటిని అందించడానికి లోకేశ్ మెషీన్స్ లిమిటెడ్ సన్నాహాలు చేస్తోంది. మరోపక్క బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) నుంచి ఈ సంస్థకు పైలట్ ఆర్డర్ వచ్చింది. ‘అస్మి’ ఈ తరహాకు చెందిన ఇతర ఆయుధాల కంటే 10–15 శాతం తక్కువ బరువుతో ఉంటుంది. దీన్ని ఆపకుండా 2,400 రౌండ్ల వరకు కాల్చే అవకాశం ఉంది.‘అస్మి’ వివరాలివీ..పేరు: అస్మిస్వరూపం: సబ్ మెషీన్ గన్ ఖరీదు: ఒక్కోటి రూ.50 వేలుబరువు: 2.4 కేజీలుపొడవు: 382 మిల్లీమీటర్లుక్యాలిబర్: 9 X 19 ఎంఎంరేంజ్: 100 మీటర్లుమ్యాగ్జైన్: 32 తూటాలుసామర్థ్యం: నిమిషానికి 800 తూటాలుపరిశోధనకు పట్టిన సమయం: మూడేళ్ల లోపు -
దౌత్య కార్యాలయాలపై దాడులు.. 43 మందిని గుర్తించిన ఎన్ఐఏ
ఢిల్లీ: అమెరికా, యూకే, కెనడాలోని భారత రాయబార కార్యాలయాలపై ఇటీవల జరిగిన దాడుల్లో 43 మంది అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గుర్తించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఆదేశాల మేరకు ఈ ఏడాది అమెరికా, యూకే, కెనడాలోని భారత దౌత్య కార్యాలయాలపై దాడుల కేసును జూన్‌లో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది మార్చి 19న లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తానీ వర్గాలు రెండు వేర్వేరు దాడులకు పాల్పడ్డాయి. జూలై 2న శాన్ ఫ్రాన్సిస్కోలో ఇలాంటి దాడులు జరిగాయి. ఈ ఏడాది ఆగష్టులో శాన్ ఫ్రాన్సిస్కోను ఎన్ఐఏ బృందం సందర్శించింది. మార్చి 2023లో కెనడా, శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన దాడులకు సంబంధించి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కూడా చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. ఈ కేసులో భారతదేశంలో ఇప్పటివరకు 50 చోట్ల దాడులు నిర్వహించామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. దాడులకు సంబంధించి సుమారు 80 మందిని విచారించారని సమాచారం. ఇదీ చదవండి: రామ మందిర విరాళాల పేరిట నకిలీ క్యూఆర్ కోడ్.. వీహెచ్‌పీ అలర్ట్ -
తొమ్మిది మిషన్స్‌తో ఏపీ కొత్త పారిశ్రామిక పాలసీ.. వివరాలు ఇవిగో..
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ 2023 – 27 పారిశ్రామిక పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందుకోసం తొమ్మిది మిషన్లను నిర్దేశించుకుని పూర్తిస్థాయి పారిశ్రామిక ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేసేలా పాలసీలో పలు ప్రతిపాదనలు చేశారు. పరిశ్రమలకు తక్కువ వ్యయంతో అన్ని మౌలిక వసతులతో కూడిన భూములను అందుబాటు ధరల్లో అందించనున్నారు. ఇందుకోసం నాలుగేళ్లలో మూడు లక్షల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. పబ్లిక్, ఫ్రైవేటు భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు స్టార్టప్‌లు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించేలా ప్రత్యేక వ్యవస్థను ప్రోత్సహించనున్నారు. ఇదే సమయంలో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలతోపాటు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా పాలసీని రూపొందించారు. సమానంగా అభివృద్ధి చెందేలా.. నాలుగేళ్ల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023 – 27 పారిశ్రామిక పాలసీ ఈ ఏడాది ఏప్రిల్ 1వతేదీ నుంచి అమల్లోకి రానుంది. గత మూడేళ్లలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకుంటూ అంతర్జాతీయ మార్కెట్లకు సేవలు అందించేలా కొత్త పాలసీని రూపొందించినట్లు పరిశ్రమలు, మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే విధంగా పాలసీలో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా వివరాలు సేకరించి పరిశ్రమలు తక్కువగా ఉన్న చోట్ల మరిన్ని ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతిపాదన నుంచి ఉత్పత్తి దాకా.. రాష్ట్రంలో పెట్టుబడి ప్రతిపాదనలతో వచ్చిన దగ్గర నుంచి ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు సింగిల్ విండో విధానంలో త్వరితగతిన అన్ని అనుమతులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. భూముల కోసం పరిశ్రమలు దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే ఏపీఐఐసీ భూమిని కేటాయిస్తుంది. పరిశ్రమలకు 33-66 ఏళ్ల కాలానికి లీజు విధానంలో భూమిని కేటాయిస్తారు. వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన 10 ఏళ్ల తర్వాత భూములను కొనుగోలు చేసుకునే హక్కును కల్పించనున్నారు. ప్రభుత్వ సేవలన్నీ ఒకే గొడుగు కింద అందించే విధంగా వైఎస్సార్ ఏపీ వన్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఎంఎస్ఎంఈలు, ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలతో పాటు లార్జ్, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు పెట్టుబడి సామర్థ్యం, ఉపాధి కల్పనను బట్టి రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పిస్తారు. మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు సంబంధించి వేగవంతంగా కార్యరూపం దాల్చేలా సీనియర్ అధికారిని ప్రత్యేకంగా కేటాయిస్తారు. ప్రాజెక్టు అమలులో ఈ అధికారి అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాలను త్వరితగతిన వాస్తవ రూపంలోకి తెచ్చేలా సీఎస్ అధ్యక్షతన కమిటీని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఒప్పందం జరిగిన రోజు నుంచి ఆర్నెల్లలో నిర్మాణ పనులు ప్రారంభించే సంస్థలకు ఎర్లీ బర్డ్ కింద ప్రోత్సాహకాలను కల్పించనున్నారు. చదవండి: ఏపీలో రూ.1,750 కోట్ల పెట్టుబడులు ఇవీ 9 మిషన్లు ♦ఎకనామిక్ గ్రోత్: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో పాటు స్థానిక పెట్టుబడులను ఆకర్షించే విధంగా పూర్తిస్థాయి ఇండస్ట్రియల్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం. ప్రపంచస్థాయి పారిశ్రామిక మౌలిక వసతులతో పాటు లాజిస్టిక్ కల్పన, సులభతర వాణిజ్యం, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించనున్నారు. ♦పోర్టు ఆధారిత అభివృద్ధి: పోర్టు ప్రాంతాలు అభివృద్ధికి మూల స్థంభాలుగా ప్రణాళికలు. వీసీఐసీ, సీబీఐసీ, హెచ్‌బీఐసీ కారిడార్స్‌తో పాటు రైలు, రోడ్డు, అంతర్గత జలరవాణా మార్గాలను ప్రస్తుత పోర్టులతో పాటు కొత్తగా నిర్మించే పోర్టులకు అనుసంధానిస్తారు. ♦లాజిస్టిక్స్ వ్యవస్థను పెంచడం: సరుకు రవాణా వ్యయం తగ్గించే విధంగా రోడ్ రైల్ నెట్‌వర్క్‌ను పెంచడం. కోస్టల్ షిప్పింగ్, అంతర్గత జలరవాణా మార్గాలను ప్రోత్సహించడం. లాజిస్టిక్ పార్కుల అభివృద్ధితో పాటు గిడ్డంగులు, శీతలీకరణ గిడ్డంగులు సౌకర్యాలను పెంచడం. ♦రెడీ టు బిల్డ్ పార్కులు: పరిశ్రమలు తక్షణం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే విధంగా ప్రస్తుత పారిశ్రామిక పార్కులతో పాటు కొత్తగా వచ్చే పార్కుల్లో రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీలు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ స్పేస్‌లు, స్టాండర్డ్ డిజైన్ ఫ్యాక్టరీస్ను అభివృద్ధి చేయడం. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రైవేట్ పారిశ్రామిక, ఎంఎస్ఎంఈ పార్కులను నెలకొల్పడం. ♦పారిశ్రామిక సేవలన్నీ ఒకేచోట: ప్రభుత్వ విభాగాలకు చెందిన సేవలు, అనుమతులన్నీ ఒకేచోట లభించే విధంగా వైఎస్సార్ ఏపీ వన్ను అభివృద్ధి చేస్తారు. ♦ఉద్యోగ కల్పన: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా ఎంఎస్ఎంఈ రంగానికి ప్రోత్సహించడంతోపాటు ఇబ్బందుల్లో ఉన్న ఎంఎస్ఎంఈలకు చేయూతనివ్వడం. లార్జ్, మెగా, అల్ట్రా మెగా పరిశ్రమలకు నిపుణులైన మానవ వనరులను అందించే విధంగా శిక్షణ, ఉపాధి కోసం ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు. ♦నైపుణ్యం కలిగిన మానవ వనరులు: కనీస చదువులు పూర్తి చేసుకున్న యువతకు పరిశ్రమల్లో అవసరమైన రంగాల్లో ప్రాక్టికల్ శిక్షణ అందించేలా నైపుణ్య శిక్షణ కోర్సులను అందుబాటులోకి తెచ్చి సాఫ్ట్ స్కిల్స్‌ను పెంపొందిస్తారు. ♦స్టార్టప్ కల్చర్‌ను ప్రోత్సహించడం: యువతను నూతన పారిశ్రామికవేత్తలుగా తీర్చి దిద్దే విధంగా మెంటారింగ్ కార్యక్రమాలు, స్టార్టప్ జోన్స్, స్టార్టప్‌లకు రాయితీలు, స్టార్టప్ ఫైనాన్సింగ్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం ♦మహిళలు, బడుగు వర్గాలకు ప్రోత్సాహం: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం. వారిని గుర్తించి పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయూతనివ్వడం. పెట్టుబడుల ఆకర్షణకు దృష్టిసారించే ప్రధాన రంగాలు ►కెమికల్స్–పెట్రోకెమికల్స్ ► ఫార్మాస్యూటికల్స్–బల్క్ డ్రగ్స్ ►టెక్స్టైల్స్ అండ్ అప్పరెల్స్ ►ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ ►ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ►ఆగ్రో, ఫుడ్ ప్రోసెసింగ్ ► ఇంజనీరింగ్ అండ్ మెడికల్ డివైసెస్ ►డిఫెన్స్ అండ్ ఎయిరోస్పేస్ ►మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ ►భవిష్యత్తు నాల్గవ తర్గతి పరిశ్రమలు తయారీ రంగం, బయోటెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ►రెన్యువబుల్ ఎనర్జీకి సంబంధించిన పరికరాల తయారీ -
ఈ-పాస్‌లతో ప్రతి నెల రూ.12 కోట్లు ఆదా
ఆహార సలహా సంఘం సమావేశంలో జేసీ కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా పంపిణీలో ఈ-పాస్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత అక్రమాలకు అడ్డుకట్ట పడి ప్రతి నెల దాదాపు రూ.12 కోట్లు ఆదా అవుతున్నాయని జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆహార సలహా సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతి రేషన్ షాపులో కేవలం ఈ-పాస్‌కు సంబంధించిన వేయింగ్ మిషన్ మాత్రమే ఉండాలని ఇతరత్రా ఎలాంటి వేయింగ్ మిషన్లు ఉండరాదన్నారు. అలా ఉంటే సంబంధిత సీఎస్డీటీలను బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామని వివరించారు. మొత్తం కార్డుల్లో 75 శాతం కార్డులకు మొదటి 3 రోజుల్లో సరుకులు పంపిణీ అవుతున్నాయని మిగిలిన వాటికి 15 వరకు పంపిణీ సరుకుల పంపణీ జరుగుతుందని వివరించారు. ఈ-పాస్‌ల్లో వేలి ముద్రలు పడకపోతే ఐరీస్‌ను పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. సభ్యుల ప్రశ్నలు ► కొందరు డీలర్లు బోగస్ రేషన్ కార్డులకు ఆధార్ నెంబర్లు లింకప్ చేసి యథావిదిగా అక్రమాలకు పాల్పడుతున్నారని శనివారం ‘సాక్షి’లో ప్రచురితం అయిన కథనాన్ని ప్రస్తావిస్తూ వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సీపీఐ నగర కార్యదర్శి రసూల్ కోరారు. ► కర్నూలులోని ఐనాక్స్ థియేటర్లో రూ.10 వస్తువును రూ.50కి అమ్ముతున్నారని బయటి నుంచి కనీసం మంచినీళ్లను కూడా అనుమతించడం లేదని దీనిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు తోట వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ► రేషన్ సరుకులను ప్రతి నెల 20 వరకు పంపిణీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు షడ్రక్ తెలిపారు. ► ప్రజా పంపిణీలో అమలుపై తీసుకోవాల్సిన చర్యలపై తీర్మానం చేయాలని మాజీ జెడ్పీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి డియాండ్ చేశారు. పండ్లను మాగించడంలో కార్బైడ్‌ను యథేచ్ఛగా వాడుతున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.