పెరగనున్న స్టడీ వీసా కష్టాలు
న్యూఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ నిజ్జర్ హత్యోదంతం తిరిగి తిరిగి చివరకు భారతీయ విద్యార్థులకు స్టడీ వీసా కష్టాలను తెచ్చిపెట్టింది. కెనడా–భారత్ దౌత్యసంబంధాలు అత్యంత క్షీణదశకు చేరుకుంటున్న వేళ కెనడా ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కల్గించే నిర్ణయాన్ని అమలుచేసింది. విద్యార్థి వీసాలను వేగంగా పరిశీలించి పరిష్కరించే ఫాస్ట్ ట్రాక్ వీసా విధానం స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(ఎస్‌డీఎస్)ను నిలిపేస్తున్నట్లు కెనడా శుక్రవారం ప్రకటించింది.
తమ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తున్నట్లు పేర్కొంది. దీంతో కెనడాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియ పెద్ద ప్రహసనంగా మారనుంది. ఇన్నాళ్లూ భారత్, చైనా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, వియత్నాంసహా 13 దేశాల విద్యార్థులకే ఎస్‌డీఎస్ కింద ప్రాధాన్యత దక్కేది. ఈ దేశాల విద్యార్థులకు స్టడీ పర్మిట్లు చాలా వేగంగా వచ్చేవి. తాజా నిర్ణయంతో ఈ 13 దేశాల విద్యార్థులు సాధారణ స్టడీ పర్మిట్ విధానంలోని దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. తాజా నిర్ణయాన్ని కెనడా సమర్థించుకుంది. జాతీయతతో సంబంధంలేకుండా అన్ని దేశాల విద్యార్థులకు సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతోనే ఎస్‌డీఎస్‌ను నిలిపేశామని వివరణ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment