Fast-track
-
ఫాస్ట్ ట్రాక్ వీసాలకు కెనడా మంగళం
న్యూఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ నిజ్జర్ హత్యోదంతం తిరిగి తిరిగి చివరకు భారతీయ విద్యార్థులకు స్టడీ వీసా కష్టాలను తెచ్చిపెట్టింది. కెనడా–భారత్ దౌత్యసంబంధాలు అత్యంత క్షీణదశకు చేరుకుంటున్న వేళ కెనడా ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కల్గించే నిర్ణయాన్ని అమలుచేసింది. విద్యార్థి వీసాలను వేగంగా పరిశీలించి పరిష్కరించే ఫాస్ట్ ట్రాక్ వీసా విధానం స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(ఎస్డీఎస్)ను నిలిపేస్తున్నట్లు కెనడా శుక్రవారం ప్రకటించింది. తమ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తున్నట్లు పేర్కొంది. దీంతో కెనడాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియ పెద్ద ప్రహసనంగా మారనుంది. ఇన్నాళ్లూ భారత్, చైనా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, వియత్నాంసహా 13 దేశాల విద్యార్థులకే ఎస్డీఎస్ కింద ప్రాధాన్యత దక్కేది. ఈ దేశాల విద్యార్థులకు స్టడీ పర్మిట్లు చాలా వేగంగా వచ్చేవి. తాజా నిర్ణయంతో ఈ 13 దేశాల విద్యార్థులు సాధారణ స్టడీ పర్మిట్ విధానంలోని దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. తాజా నిర్ణయాన్ని కెనడా సమర్థించుకుంది. జాతీయతతో సంబంధంలేకుండా అన్ని దేశాల విద్యార్థులకు సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతోనే ఎస్డీఎస్ను నిలిపేశామని వివరణ ఇచ్చింది. -
ఎన్ఎస్ఈఎల్ కేసుల కోసం స్పెషల్ కోర్టులు
న్యూఢిల్లీ: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజి లిమిటెడ్‌కు సంబంధించిన అన్ని కేసులను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాధాన్యతా క్రమంలో విచారించే ఉద్దేశంతో త్వరలోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయనున్నట్టు ఆదివారం ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీచేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో రూ 5,600 కోట్ల నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ కుంభకోణం కేసులో త్వరిత గతిన విచారణ పూర్తి చేయాలని యోచిస్తున్నట్టు తెలిపింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్ఎస్ఈఎల్ స్కాంకు సంబంధించి వివిధ విచారణ సంస్థలు అందజేసిన నివేదికల పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి), ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారతదేశం యొక్క సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ (సెబీ) లు ఎటాచ్ చేసిన ఆస్తులు వేలం వేగవంతం చేసి ఆయా పెట్టుబడిదారులకు వాపసు చేయాలని కోరింది. అలాగే ఎన్ ఎస్ ఈఎల్, ఎఫ్ టీఐఎల్ విలీనం ప్రక్రియను వేగవంతం చేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సూచించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈవోడబ్ల్యూ ఎటాచ్ చేసిన ఆస్తుల అమ్మకాలకు రంగం సిద్ధం చేసినట్టు తెలిపింది. మహారాష్ట్ర గెజిట్ లో నోటిఫై చేసిన సుమారు 6,115 కోట్ల రూపాయలు విలువచేసే 711 ఆస్తులను వేలం వేయనునుట్టు తెలిపింది. ఇప్పటివరకు ఎంపీఐడీ చట్టం ప్రకారం 7,063 కోట్ల రూపాయల విలువచేసే 831 ఆస్తులను ఎటాచ్ చేసినట్టుతెలిపింది. కాగా ఎఫ్ టీఐఎల్ ప్రమోటర్ జిగ్నేష్ షాను అరెస్ట్ చేసిన ఈడీ ఆగస్గు 1 వరకు రిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
రుణ సమీకరణకు నవభారత్, అవంతి కసరత్తు
ఫాస్ట్ ట్రాక్... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వడ్డీరేట్లు తగ్గడమే కాని పెరిగే అవకాశం లేదన్న స్పష్టమైన సంకేతాలకు తోడు ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందన్న నమ్మకంతో రాష్ట్ర కంపెనీలు విస్తరణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందుకు కావల్సిన నిధులను రుణాల రూపంలో సేకరించడానికి వాటాదారుల అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. ఫెర్రోఅల్లాయిస్, విద్యుత్ ఉత్పాదక రంగంలో ఉన్న నవభారత్ వెంచర్స్ రుణాల రూపంలో రూ.3,000 కోట్లు సమీకరించాలని తాజాగా నిర్ణయించింది. ఇందుకోసం వాటాదారుల అనుమతి కోసం పోస్టల్ బ్యాలెట్, ఈ-వోటింగ్ ప్రక్రియను ప్రారంభించింది. 2012లోనే నవభారత్ వెంచర్స్ గరిష్టంగా రూ.10,000 కోట్లు సమీకరించడానికి బోర్డు అనుమతి మంజూరు చేసినప్పటికీ కొత్త కంపెనీల చట్టం ఇంత మొత్తం సమీకరించడానికి అంగీకరించకపోవడంతో రూ.3,000 కోట్లు సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది. ఇదే బాటలో చేపలకు ఆహారాన్ని ఉత్పత్తి చేసే అవంతి ఫీడ్స్ కూడా వ్యాపార విస్తరణ కార్యకలాపాల కోసం రూ.500 కోట్లు సమీకరించనుంది. అదే విధంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న రిజిస్ట్రార్ ఆఫీసును విశాఖపట్నానికి కూడా మారుస్తోంది. ఈ రెండు నిర్ణయాలపై ఆమోదాన్ని కోరుతూ కంపెనీ వాటాదారుల అనుమతి కోరుతోంది. జూన్ 28న ప్రారంభమయ్యే పోస్ట్ బ్యాలెట్/ఈ వోటింగ్ జూలై 8తో ముగుస్తుంది.