ఫాస్ట్ ట్రాక్...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వడ్డీరేట్లు తగ్గడమే కాని పెరిగే అవకాశం లేదన్న స్పష్టమైన సంకేతాలకు తోడు ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందన్న నమ్మకంతో రాష్ట్ర కంపెనీలు విస్తరణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందుకు కావల్సిన నిధులను రుణాల రూపంలో సేకరించడానికి వాటాదారుల అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి.
ఫెర్రోఅల్లాయిస్, విద్యుత్ ఉత్పాదక రంగంలో ఉన్న నవభారత్ వెంచర్స్ రుణాల రూపంలో రూ.3,000 కోట్లు సమీకరించాలని తాజాగా నిర్ణయించింది. ఇందుకోసం వాటాదారుల అనుమతి కోసం పోస్టల్ బ్యాలెట్, ఈ-వోటింగ్ ప్రక్రియను ప్రారంభించింది. 2012లోనే నవభారత్ వెంచర్స్ గరిష్టంగా రూ.10,000 కోట్లు సమీకరించడానికి బోర్డు అనుమతి మంజూరు చేసినప్పటికీ కొత్త కంపెనీల చట్టం ఇంత మొత్తం సమీకరించడానికి అంగీకరించకపోవడంతో రూ.3,000 కోట్లు సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది.
ఇదే బాటలో చేపలకు ఆహారాన్ని ఉత్పత్తి చేసే అవంతి ఫీడ్స్ కూడా వ్యాపార విస్తరణ కార్యకలాపాల కోసం రూ.500 కోట్లు సమీకరించనుంది. అదే విధంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న రిజిస్ట్రార్ ఆఫీసును విశాఖపట్నానికి కూడా మారుస్తోంది. ఈ రెండు నిర్ణయాలపై ఆమోదాన్ని కోరుతూ కంపెనీ వాటాదారుల అనుమతి కోరుతోంది. జూన్ 28న ప్రారంభమయ్యే పోస్ట్ బ్యాలెట్/ఈ వోటింగ్ జూలై 8తో ముగుస్తుంది.
రుణ సమీకరణకు నవభారత్, అవంతి కసరత్తు
Published Wed, Jun 25 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM
Advertisement