టొరంటో: ఖలిస్థాన్ మద్దతుదారుల ఫ్రీడం ర్యాలీకి దీటుగా వారి కంటే ఎక్కువ సంఖ్యలో హాజరై కెనడా భారతీయులు ఐక్యత చాటుతూ ర్యాలీ నిర్వహించారు. ఖలిస్థాన్ ఫ్రీడం ర్యాలీలో భాగంగా కెనడాలోని ఖలిస్థాన్ మద్దతుదారులు భారత కాన్సులేట్ ఎదుట పోగయ్యారు. అయితే వారికంటే అధిక సంఖ్యలో వారికి దీటుగా భారత్ జెండాలతో ప్రదర్శన చేశారు అక్కడి భారతీయులు. అంతే మరి.. తాడిని తన్నే వాడొకడుంటే, వాడిని తలదన్నే వాడొకడుంటాడంటారు.
మాజీ భారత ప్రధాని 1984లో తలపెట్టిన ఆపరేషన్ బ్లూ జరిగి 39 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఖలిస్థాన్ మద్దతుదారులు 5 కి.మీ ర్యాలీ నిర్వహించి ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని శకటాల ద్వారా ప్రదర్శించి సర్దార్ సాహిబ్ సింగ్ హత్యకు ప్రతీకారంగా అని రాశారు. అది జరిగిన సరిగ్గా నెలరోజులకు ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను అక్కడి గురుద్వారా ఎదుటే కాల్చి చంపబడ్డాడు.
దీంతో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు నిరసనగా జులై 8న ర్యాలీ నిర్వహించనున్నట్లు పోస్టర్లతో ఎంబసీ వద్ద హడావుడి చేశారు ఖలిస్తానీలు. ఒట్టావా భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, కాన్సులేట్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవలను నిజ్జర్ హంతకులుగా చిత్రీకరిస్తూ కొన్ని పోస్టర్లు వేయడం వివాదాస్పదమైంది.
అమెరికా కాన్సులేట్ ముందు కూడా ఈ ర్యాలీకి సంబంధించిన పోస్టర్లతో అక్కడి ఖలిస్తానీలు రచ్చ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం ర్యాలీకి సంబంధించి కెనడా, యూఎస్, యూకే ఎంబసీల ఎదుట పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు.
జులై 8 ఉదయాన్నే కెనడాలో ఖలిస్థాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున కెనడా కాన్సులేట్ వద్దకు చేరుకొని ఖలిస్థాన్ చిహ్నమున్న జెండాలు పట్టుకుని నిజ్జర్ కు జేజేలు పలుకుతూ భారత జెండాను చింపేసి కించపరిచారు. అందుకు దీటుగా కెనడాలోని భారతీయులు ఖలిస్తానీల కంటే రెట్టింపు సంఖ్యలో అక్కడికి చేరి ఖలిస్తానీలు భారతీయులు కాదని పోస్టర్లు రాసి "వందేమాతరం" "భారత్ మాతా కీ జై" అంటూ ఆకాశాన్ని తాకేలా నినదించారు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని ఖలిస్తానీలు దెబ్బకు ఖంగుతిన్నారు.
#WATCH | Members of the Indian diaspora held a counter protest against pro-Khalistan supporters in front of the Indian consulate in Canada's Toronto on July 8 pic.twitter.com/lZvRiSdVs1
— ANI (@ANI) July 9, 2023
ఇది కూడా చదవండి: యుద్ధంలో కీలక పరిణామం..ఉక్రెయిన్ కమాండర్లు విడుదల..
Comments
Please login to add a commentAdd a comment