అమిత్‌ షాపై కెనడా సంచలన ఆరోపణ | Canadian Deputy Foreign Minister Allegations On Amit Shah Over His Involvement In Plot To Attack Khalistanis | Sakshi
Sakshi News home page

అమిత్‌ షాపై కెనడా సంచలన ఆరోపణ

Published Wed, Oct 30 2024 11:35 AM | Last Updated on Wed, Oct 30 2024 12:33 PM

Canadian Deputy foreign Minister Allegations On Amit Shah

అట్టావా: భారత హోంమంత్రి అమిత్‌ షాపై కెనడా సంచలన ఆరోపణలు చేసింది. కెనడాలోని ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలకు అమిత్ షా అనుమతి ఇచ్చారని కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి చెప్పుకొచ్చారు. దీంతో, రెండు దేశాల మధ్య మరోసారి రాజకీయం వేడెక్కింది.

తాజాగా ఓ కార్యక్రమంలో కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి నటాలియా డ్రౌయిన్‌ మాట్లాడుతూ..‘కెనడాలో ఖలిస్తానీ ఏర్పాటువాది నిజ్జర్‌ హత్య కేసులో భారత ప్రభుత్వ అధికారుల హస్తం ఉంది. ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలకు అమిత్ షా అనుమతి ఇచ్చారు. ఈ విషయాలను మేము వెల్లడిస్తున్నాం. ఇదే సమయంలో ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో దర్యాప్తు విషయాలను తాము కావాలనే అమెరికా పత్రిక వాషింగ్టన్‌ పోస్టుకు లీక్‌ చేసినట్లు అంగీకరించారు.

ఈ విషయాలు చెప్పేందుకు, తాను ఆ సమాచారం లీక్‌ చేయడానికి ట్రూడో అనుమతి అవసరం లేదన్నారు. ఈ దౌత్య వివాదంలో ఒక అమెరికన్‌ మీడియా కెనడా వాదనను వినిపించేలా చేస్తానన్నారని డిప్యూటీ విదేశాంగ మంత్రి డేవిడ్‌ మోరిసన్‌ తెలిపారు. తమ కమ్యూనికేషన్‌ వ్యూహం మొత్తాన్ని ట్రూడో ఆఫీస్‌ పర్యవేక్షిస్తోందని చెప్పారు.

 ఇక, అక్టోబర్‌ 14వ తేదీకి ముందు తాను వాషింగ్టన్‌ పోస్టు పత్రికకు వెల్లడించిన సమాచారం సీక్రెట్‌ ఏమీ కాదని నటాలియా సదరు ప్యానల్‌కు వెల్లడించారు. భారత్‌తో సహకారానికి తాము తీసుకొన్న చర్యలు కూడా అందులో ఉన్నాయన్నారు. కెనడా వాసులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన ఆధారాలను న్యూఢిల్లీకి వెల్లడించినట్టు చెప్పుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement