న్యూయార్క్: భారతదేశ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కెనడా చేసిన ఆరోపణలను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఖలిస్థానీ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ను లక్ష్యంగా చేసుకోవడంలో కేంద్ర మంత్రి అమిత్ షా హస్తం ఉందంటూ కెనడా ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించింది.
‘‘కెనడా ప్రభుత్వం చేసిన ఆరోపణలు ఆందోళనకరమైన పరిణామం. మేం ఆ ఆరోపణల గురించి కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తాం. ఈ ఆరోపణలపై పూర్తి సమాచారం తెలుసుకుంటాం’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు.
Canada’s allegations against Union Home Minister Amit Shah are “concerning”, the United States said on Wednesday, noting that it would continue to consult Ottawa on the issue @PMOIndia @AmitShah @AmitShahOffice #India @State_SCA @StateDeptSpox pic.twitter.com/RQKU94pX7K
— Jahanzaib Ali (@JazzyARY) October 31, 2024
కెనడాలోని ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలకు భారత హోంశాఖ మంత్రి అమిత్ షా అనుమతి ఇచ్చారని కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి నటాలియా డ్రౌయిన్ ఆరోపణలు చేశారు.
‘‘కెనడాలో ఖలిస్తానీ ఏర్పాటువాది నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ అధికారుల హస్తం ఉంది. ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలకు అమిత్ షా అనుమతి ఇచ్చారు. ఈ విషయాలను మేము వెల్లడిస్తున్నాం. ఇదే సమయంలో ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తు విషయాలను తాము కావాలనే అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టుకు లీక్ చేశాం’’ అని అన్నారు.కేంద్ర మంత్రి అమిత్ షాను టార్గెట్ ఆరోపణలు చేయటంపై ఇప్పటికే భారత్ తీవ్రంగా ఖండించింది.
చదవండి: US Elections 2024: చెత్త చుట్టూ అమెరికా ఎన్నికల సమరం
Comments
Please login to add a commentAdd a comment