
ఒట్టావా:కెనడా-భారత్ మధ్య వివాదానికి కారణమైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో పాకిస్థాన్ ఉగ్రసంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజ్జర్ హత్యతో భారత్-కెనడా మధ్య చెలరేగిన వివాదం పథకంలో భాగమనే అనుమానాలు వెల్లడవుతున్నాయి.
అయితే.. ఇటీవల కెనడాలో పాగా వేయాలనే ఐఎస్ఐ సంకల్పించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఆ దేశంలో కొంత మంది ఉగ్రవాదులను కూడా దింపింది. వారికి సహకరించాలని ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌పై ఒత్తిడి చేసిందట. ఆయన ఐఎస్‌ఐ ఉగ్రవాదులకు సహకరించకుండా ఖలిస్థానీ మద్దతుదారుల వైపే మొగ్గు చూపారట. అందుకే నిజ్జర్‌ను హత్య చేశారనే అనుమానాలు వెల్లడవుతున్నాయి. తమకు సహకరించడానికి ఐఎస్‌ఐ మరో వ్యక్తిని వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖలిస్థానీ మద్దతుదారులకే మద్దతునిస్తున్నారని సమాచారం.
ఇండియా-కెనడా వివాదం..
హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు ఇండియా-కెనడా మధ్య వివాదానికి దారితీసింది. నిజ్జర్ హత్యలో భారత దౌత్య వేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీనిని భారత్ ఖండించింది. ఈ పరిణామాల తర్వాత ఇరు దేశాలు ఆంక్షలను విధించుకున్నాయి. భారత్ వీసాలను కూడా రద్దు చేసింది. అటు.. దేశంలో ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేస్తోంది. ఐక్యరాజ్య సమితి 78వ సర్వ సభ్య సమావేశంలోనూ ఈ అంశాన్ని భారత్ లేవనెత్తింది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ఆరోపణలు చేయరాదని విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఖలిస్తానీలకు కెనడా ముస్లింలు ఎందుకు మద్దతు పలుకుతున్నారు?
Comments
Please login to add a commentAdd a comment