న్యూయార్క్: భారత్-కెనడా వివాదంలో అమెరికా తలదూర్చకపోవచ్చని రాజకీయ వ్యూహ సంస్థ సిగ్నమ్ గ్లోబల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు చైర్మన్ చార్లెస్ మైయర్స్ చెప్పారు. కెనడా వివాదం కారణంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో ఏర్పరుచుకున్న సంబంధాలకు అమెరికా ఇబ్బంది కలిగించబోదని ఆయన అన్నారు. ఈ వ్వవహారంలో అంటీ అంటనట్లు ఉండవచ్చని అంచనా వేశారు.
భారత్- కెనడా వివాదంలో ఇరుదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అమెరికా చెప్పింది. సమస్యను పరిష్కరించడానికి ఇరుదేశాలు సహకరించుకోవాలని కోరింది. ఈ అంశంలో భారత్ జవాబుదారీగా ఉండాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు. కానీ అమెరికా దాని మిత్రపక్షాలు ఈ అంశంలో భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించడం వంటి చర్యలు తీసుకోకుండా ఆగిపోయాయి.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతవారం వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఇది రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఆ తర్వాత ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇరుపక్షాలు దౌత్య వేత్తలను బహిష్కరించాయి. కెనడా వీసాలను భారత్ రద్దు చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపణలు చేస్తోందని భారత్ మండిపడింది. రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి: కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment