ఒట్టావా: ఖలిస్తానీ అనుకూల నేత హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య వీడియో తొలిసారి కెనడాలోని ఓ టీవీ చానల్‌లో ప్రసారమైంది. గత ఏడాది జూన్ 18న కెనడా బ్రిటీష్ కొలంబియా ప్రావిన్సులోని సర్రే పట్టణంలో ఉన్న గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్ ఆవరణలో నిజ్జర్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే.
ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ వీడియోను కెనడాలో తొలిసారిగా అధికారిక సీబీసీ న్యూస్ చానల్ ప్రసారం చేసింది. గురుద్వారా పార్కింగ్ ప్లేస్‌లో నిజ్జర్ ప్రయాణిస్తున్న వైట్ సెడాన్‌కారును ఒక పిక్‌అప్ ట్రక్కు తొలుత అడ్డగిస్తుంది. అనంతరం ట్రక్కులో నుంచి నిజ్జర్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చిన మాస్కులు ధరించిన వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపి అక్కడే వేచి ఉన్న టయోటా క్యామ్రీ కారులో ఎక్కి పారిపోయిన దృశ్యాలు ప్రసారమయ్యాయి.
ఈ కేసులో ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క నిందితుడిని కూడా అరెస్టు చేయలేకపోయింది. నిజ్జర్ హత్య కేసును ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్(ఐహెచ్‌ఐటీ)దర్యాప్తు చేస్తోంది. నిజ్జర్ హత్యతో భారత వేగులకు సంబంధముందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గత ఏడాది సెప్టెంబర్ 18న ఆ దేశ పార్లమెంటులో వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యల తర్వాత భారత్, కెనడా మధ్య సంబంధాలు బలహీనమయ్యాయి.
ఇదీ చదవండి.. కెనడాలో భారత సంతతి వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులు
Comments
Please login to add a commentAdd a comment