వాషింగ్టన్/ఒట్టావా: ఖలిస్తాన్ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు తాజాగా మరో భారతీయుడిని అరెస్ట్‌చేశారు. బ్రాంప్టన్ సిటీలో నివసించే 22 ఏళ్ల అమన్‌దీప్ సింగ్‌ను హత్య, హత్యకు కుట్ర నేరాల కింద అరెస్ట్‌చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఉదంతంలో గత వారమే ముగ్గురు భారతీయులను అక్కడి పోలీసులు అరెస్ట్‌చేశారు.
అమన్‌దీప్‌ను ఒంటారియాలో మే 11న అరెస్ట్‌చేసినట్లు రాయల్ కెనడియన్ పోలీసులు ఆదివారం ప్రకటించారు. బ్రిటిష్ కొలంబియాలో 2023 జూన్ 18వ తేదీన గురునానక్ గురుద్వారా వద్ద 45 ఏళ్ల నిజ్జర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెల్సిందే. నిజ్జర్‌ను చంపిన ఇద్దరు షూటర్లలో అమన్‌దీప్ ఒకడని గ్లోబల్ న్యూస్ ఒక కథనం వెలువర్చింది.
Comments
Please login to add a commentAdd a comment