Canada–India relations: అక్కడి నుంచే సమాచారం | Canada official claims having intelligence inputs implicating India hand in Nijjar murder | Sakshi
Sakshi News home page

Canada–India relations: అక్కడి నుంచే సమాచారం

Published Sat, Sep 23 2023 8:08 AM | Last Updated on Sat, Sep 23 2023 8:08 AM

Canada official claims having intelligence inputs implicating India hand in Nijjar murder - Sakshi

టొరంటో: ఖలిస్తాన్‌ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ప్రమేయం ఉందని కెనడా చేసిన ఆరోపణలకు ఫైవ్‌ ఐస్‌ నెట్‌వర్క్‌ అందించిన సమాచారమే ఆధారమని తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి కెనడా ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఆ దేశ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. జూన్‌ 18న బ్రిటిష్‌ కొలంబియాలోని ఒక గురుద్వారాలో నిజ్జర్‌ను దుండగులు కాల్చి చంపిన తర్వాత కెనడా ప్రభుత్వం సాగించిన విచారణలో అయిదు కళ్ల కూటమిలో ఒక భాగస్వామ్య దేశం అందించిన సమాచారం ఆధారంగానే భారత్‌ ప్రమేయం ఉందన్న అనుమానాలు వచ్చాయని సీబీసీ న్యూస్‌ ఒక కథనంలో వెల్లడించింది.

కెనడాలో భారత్‌ దౌత్యవేత్తల కమ్యూనికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఆ దేశం కెనడాకు పంపినట్టుగా తెలిపింది. మానవ మేధస్సు, సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా ఆ దేశం పంపిన సమాచారంలో భారత్‌ ప్రమేయంపై అనుమానాలున్నట్టు తెలుస్తోంది. కెనడాతో పాటు అమెరికా, యూకే, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్‌ దేశాలు సభ్యత్వం ఉన్న ఆ కూటమిలో ఏ దేశం భారత్‌ ప్రమేయం ఉందని చెబుతున్న సమాచారం అందించిందో సీబీసీ న్యూస్‌ వెల్లడించలేదు.  

కెనడాలో విద్వేషానికి చోటు లేదు
భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న వేళ హిందువుల్ని బెదిరిస్తున్న వీడియో మరింతగా ఆందోళనల్ని పెంచుతోంది. కెనడాలో నివసిస్తున్న హిందువులు దేశం వీడి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు దిగిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందించిన కెనడా ప్రభుత్వం ఇలాంటి విద్వేషపూరితమైన చర్యలకి తమ దేశంలో చోటు లేదని పే ర్కొంది. కెనడాలో నివసిస్తున్న వారెవరూ భయాందోళనలకు లోనుకావల్సిన పని లేదని హామీ ఇచి్చంది.  

భారత్‌కు ప్రత్యేక మినహాయింపులుండవ్‌: అమెరికా
ఖలిస్తాన్‌ అంశంలో కెనడా, భారత్‌ మధ్య రగిలిన చిచ్చుపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సలీవాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ప్రమేయం ఉందన్న ఆరోపణలకు సంబంధించి తాము భారత్‌ దౌత్యవేత్తలతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నామన్నారు. ఈ అంశంలో భారత్‌కు ప్రత్యేకంగా ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. భారత్‌తో బంధాల బలోపేతం కోసమే కెనడా వైపు అమెరికా మాట్లాడడం లేదన్న ఆరోపణలు వచి్చన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడాతో తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement