న్యూఢిల్లీ: ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా దౌత్యకార్యాలయంలోని భారతీయ ఏజెంట్ ప్రమేయముందని ఆరోపిస్తూ ఆయనకు బహిష్కరించిన కొద్దీ సేపటికే భారత్ దెబ్బకు దెబ్బ తీసింది. భారత్‌లోని కెనడా దౌత్యాధికారిని బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఖలిస్థానీ టైగర్ ఫోర్స్‌కు చెందిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారతీయ ఏజెంట్‌కు సంబంధమున్నట్లు తమవద్ద ఆధారాలున్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంటులో ప్రకటించారు. ఆయితే భారత ప్రభుత్వం ఈ ఆరోపణలు నిరాధారమైనవని ఖండించింది. కెనడా ప్రధాని ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే భారత దౌత్యాధికారిని బహిష్కరిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు.
దీనికి బదులుగా భారత్ కూడా కెనడాకు అంతే దీటుగా స్పందించింది. మన అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యం చేసుకోకడమే కాకుండా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడిన నేరానికి భారత్‌లోని కెనడా దౌత్యాధికారిని వెంటనే బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది భారత విదేశాంగ శాఖ. భారత్‌కు కెనడా హైకమిషనర్ అయిన కామెరూన్ మెక్‌కేను ఐదు రోజుల్లో దేశాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది.
The High Commissioner of Canada to India was summoned today by GOI and informed about it’s decision to expel senior Canadian diplomat and to leave India within the next five days! pic.twitter.com/wgJdvpLnzE
— Prof.N John Camm (@njohncamm) September 19, 2023
ఇది కూడా చదవండి: గాయపడిన సైనికులకు జెలెన్‌స్కీ పరామర్శ
Comments
Please login to add a commentAdd a comment