Vardhman textiles Suchita Oswal Jain success story{ 22 ఏళ్లకే కంపెనీ పగ్గాలు చేపట్టి విజయ పథంలో నడిపించడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో తనకు తానే సాటి నిరూపించుకున్నారు.వర్ధమాన్ టెక్స్‌టైల్స్‌కు వైస్ ప్రెసిడెంట్ , జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచితా ఓస్వాల్ జైన్. భారతదేశంలోని అతిపెద్ద టెక్స్‌టైల్ కంపెనీలలో ఒకటైన ఈ గ్రూప్‌ని సుచితా తండ్రి ఎస్‌పి ఓస్వాల్‌తో, తాత రత్తన్ చంద్ ఓస్వాల్ కలిసి స్థాపించారు.ఇప్పుడు ఎస్‌పి ఓస్వాల్ ఛైర్మన్‌గా ఉన్నారు. లూథియానాకు చెందిన ఓస్వాల్ కుటుంబంలోని సుచితా ఈ కుటుంబ వ్యాపారంలో మూడో జనరేషన్‌కుచెందిన వారు.ఏదో ఒకటి చేయాలనే కోరిక, ఏదో సాధించాలి అన్న పట్టుదలే రెండు దశాబ్దాల కృషితో కంపెనీని స్థాయికి చేర్చింది.
వర్ధమాన్ టెక్స్‌టైల్స్ ప్రస్థానం 6000 స్పిండిల్స్‌తో ప్రారంభించింది.మరిపుడు సుచితా నేతృత్వంలో బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ టర్నోవర్‌తో భారతదేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ తయారీదారులలో ఒకటిగా అవతరించింది. 1965లో ప్రారంభమైనప్పటి నుండి, ఛైర్మన్ ఎస్‌పీ ఓస్వాల్ డైనమిక్ లీడర్‌షిప్‌లో టెక్స్‌టైల్ మేజర్‌గా అభివృద్ధి చెందింది. కానీ ఆ తరువాత 1990లో సుచితా కంపెనీలో చేరిన తరువాత బట్టల తయారీలో విభిన్నంగా మరింత అభివృద్ధి చెంది. 64 మగ్గాల నుండి, సంస్థ ఇప్పుడు 1544 మగ్గాలను నిర్వహిస్తోంది.
సుచితా ఓస్వాల్ జైన్ ఆధ్వర్యంలోని కంపెనీ అనేక జాతీయ ,అంతర్జాతీయ క్లయింట్‌ల సాధించింది.పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ , తమిళనాడు వంటి 5 రాష్ట్రాలలో 20కి పైగా ఉత్పత్తి యూనిట్లు, 30 వేల మందికాగా పైగా ఉద్యోగులున్నారు.
తండ్రి, పద్మభూషణ అవార్డ్ గ్రహీత ఎ స్‌పీ ఓస్వాల్ సమక్షంలో చిన్నతనంలోనే తయారీ కేంద్రాలను సందర్శించేది. తండ్రి మార్గదర్శకత్వంలోనే కంపెనీని నడిపించాలనీ, సమాజానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. లండన్ బిజినెస్ స్కూల్ INSEAD పారిస్ నుండి ఎంబీఏ చేసిన అనుభవంతోనె కంపెనీ శరవేగంగా ఆధునికతవైపు పరుగులు పెట్టించింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డీలో కంపెనీ తొలి ఫాబ్రిక్ తయారీ కేంద్రాన్ని స్థాపించారు. ఆమె తరువాత డైయింగ్, ప్రాసెసింగ్, ప్రింటింగ్ యూనిట్లను జోడించింది. సుచితా ఫిక్సీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కూడా. ఇంటర్నేషనల్ టెక్స్‌టైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫెడరేషన్ బోర్డు సభ్యురాలు. యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్ మెంబర్.. 8వ వరల్డ్ ఉమెన్ లీడర్‌షిప్ కాంగ్రెస్ , 2021లో ఇండియా CSR లీడర్‌షిప్, ఔట్‌స్టాండింగ్ విమెన్ లీడర్ అవార్డు లభించింది. అంతేకాదు ఆమె ఇద్దరు కుమార్తెలు కంపెనీ పగ్గాలు చేపట్టి తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.
తన సక్సెస్‌కు కారణం తన తల్లిదండ్రులే అంటారు సుచిత. వారి ప్రోత్సాహమే తన కుటుంబ వ్యాపారాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో సహాయ పడిందంటారు. న్యూ డిజిటల్ టెక్నాలజీ, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఆర్థిక స్వాతంత్ర్యం వీటి పుణ్యమా అని మహిళలకు కొత్త అవకాశాలు వస్తున్నాయి. మీరేం అనుకున్నారో అది సాధించడానికి నిబద్దతో కదలండి. ఎవరు బాస్ కావాలి అనేది గ్లాస్ సీలింగ్ ఏమీలేదు.విమర్శల్ని గాలికి వదిలి. రెక్కలు విప్పి ఎగరండి అంతే అని సందేశమిస్తారు సుచితా
కంపెనీని మరింత అభివృద్ధి చేయడంతోపాటు,మరిన్ని దేశాలకు ఎగుమతి చేయాలనుకుంటున్నాం, తద్వారా భారతీయ కార్మికులు,వ్యవస్థాపకుల అద్భుతమైన సామర్థ్యం, నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటా చెప్పాలి..భారతీయ కంపెనీలు అంతర్జాతీయ రంగంలో నిజంగా బాగా రాణించగలవు అంటారామె. GAP, Uniqlo, Marks & Spencer, Target, H&M, Kohl's, Calvin Klein మొదలైన అంతర్జాతీయ బ్రాండ్‌లకు కూడా కంపెనీ తన ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. గతేడాది కంపెనీ టర్నోవర్ రూ.12,003 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment