
సాక్షి, హైదరాబాద్: షాపింగ్‌మాల్స్ తమ సంస్థ లోగోతో ముద్రించిన క్యారీబ్యాగ్‌లను వినియోగదారుడికి ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ వినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రం ఆదేశించింది. షాపర్స్ స్టాప్ లోగో ఉన్న క్యారీ బ్యాగ్‌ను రూ.5కు విక్రయించడంపై హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. లోగో ఉన్న క్యారీ బ్యాగ్‌ను ఉచితంగా ఇవ్వాలని, లేదంటే అది విక్రయించడం ద్వారా వినియోగదారుని డబ్బుతో సంస్థ ప్రచారం చేసుకోవడం అవుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంస్థ లోగో ఉన్న బ్యాగులను ఉచితంగా ఇవ్వాలని గతంలో చండీగఢ్ వినియోగదారుల ఫోరం తీర్పునిచ్చింది. దీని ఆధారంగా అధికారులు షాపర్స్ స్టాప్‌కు నోటీసులు జారీ చేసి రూ.7 వేలు జరిమానా విధించారు.
దుకాణదారులతో ఎటువంటి వివాదాలు తలెత్తినా, వినియోగదారులు అన్ని ప్రభుత్వ పనిదినాల్లోనూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని వినియోగ వ్యవహారాల కమిషనర్ తెలిపారు. ఎర్రమంజిల్‌లోని కార్యాలయంలో నేరుగా లేదా 1800425 00333 టోల్‌ఫ్రీ నంబరుకు సంప్రదించి సేవలు పొందవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment