అమర జవాన్ల కోసం 'స్టాండ్ ఫర్ ద నేషన్‌' | Stand For The Nation Programme Is Tribute To Pulwama Martyrs | Sakshi
Sakshi News home page

అమర జవాన్ల కోసం 'స్టాండ్ ఫర్ ద నేషన్‌'

Published Sat, Nov 2 2019 2:43 PM | Last Updated on Sat, Nov 2 2019 5:06 PM

Stand For The Nation Programme Is Tribute To Pulwama Martyrs - Sakshi

సాక్షి, విజయవాడ: ఆసరా సంస్థ ఆధ్వర్యంలో 'స్టాండ్ ఫర్ ద నేషన్' బ్రోచర్ ఆవిష్కరణ శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. విజయవాడ వినియోగదారుల (కన్జ్యూమర్‌) ఫోరమ్ జడ్జి మాధవరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. పుల్వామా దాడిలో అమరులైన 40 మంది సైనికులకోసం ఆసరా సంస్థ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. రాబోయే ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 3 గంటల15 నిమిషాలకు అమరులైన జవాన్ల కోసం నివాళిగా స్టాండ్ ఫర్ ద నేషన్ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టనుందని  పేర్కొన్నారు.

దేశంలోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఆసరా ద్వారా ఢిల్లీ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వినియోగదారులకు అందించిన సేవలు మరువలేనివని మాధవరావు ప్రశంసించారు. చట్టం గురించి తెలియని వారి కోసం.. ఆసరా సంస్థ సభ్యులు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement