బెంగళూరు : ఎవరి డెబిట్ కార్డులు వారు మాత్రమే వినియోగించాలన్న నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధనను చాలా మంది పట్టించుకోవడం లేదు. కర్ణాటకలోని వినియోగదారుల ఫోరమ్ తీర్పు చూశాక మీ డెబిట్ కార్డు ఇతరులకు ఇవ్వాలంటే కచ్చితంగా ఆలోచిస్తారు. ఓ కేసుపై దీర్ఘకాల విచారణ చేపట్టిన ఫోరమ్ భార్య డెబిట్ కార్డు వినియోగించే హక్కు భర్తకు కూడా లేదని తేల్చిచెప్పింది.
వివరాల్లోకి వెళ్లే మరతహళ్లికి చెందిన వందన... 2013 నవంబర్ 14వ తేదీన, తన ఎస్‌బీఐ డెబిట్ కార్డు భర్త రాజేశ్‌కు ఇచ్చి 25,000 డ్రా చేసుకు రమ్మన్నారు. దీంతో రాజేశ్ ఏటీఎంకు వెళ్లాడు. అక్కడ డబ్బులు రాకపోగా.. అకౌంట్లో నుంచి డబ్బులు మాత్రం కట్ అయ్యాయి. వెంటనే ఆ దంపతులు ఎస్‌బీఐ ఫిర్యాదు చేసినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో ఆమె అక్టోబర్‌లో జిల్లా వినియోగదారుల ఫోరమ్‌ను సంప్రదించారు. ఫోరమ్ ఆదేశాలతో మళ్లీ ఆమె అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ఎస్‌బీఐ సీసీటీవీ పరిశీలించి అందులో ఆమె భర్త డెబిట్ కార్డును వాడినట్టు తేలడంతో ఈ కేసును మూసివేస్తున్నట్టు తెలిపింది. బ్యాకింగ్ చట్టాల ప్రకారం ఎవరి డెబిట్ కార్డును వారే వినియోగించాలని పేర్కొంది. ఈ కేసులో ఇతరులకు పిన్ షేర్ చేయడాన్ని సాకుగా చూపింది ఎస్‌బీఐ.
మూడున్నరేళ్లపాటు కొనసాగిన ఈ కేసులో వినియోగదారుల ఫోరం మే 29న కేసును తోసిపుచ్చుతూ తుది తీర్పు వెలువరించింది. తీర్పులో వందన తన ఏటీఎం పిన్ నంబర్ తన భర్తకు చెప్పి ఉండాల్సింది కాదని పేర్కొంది. తనకు అంతగా కావాలంటే చెక్ ద్వారానో మరేదైనా మార్గంలో డబ్బులు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment