లక్నో : తప్పుడు తేదీతో రైల్వే టికెట్‌ను ముద్రించడమే కాకుండా, టికెట్ కొన్న ప్రయాణికుడ్ని రైలు నుంచి బలవంతంగా దింపేసినందుకు భారతీయ రైల్వేకు ఫైన్ పడింది. ఉత్తరప్రదేశ్‌లోని సహారాపూర్ జిల్లా వినియోగదారుల కోర్టు మంగళవారం రైల్వేస్‌కు రూ. 13 వేల జరిమానా విధించింది. వివరాలు.. 2013 నవంబర్ 19న సహారాపూర్ నుంచి జావున్‌పూర్ వెళ్తున్న హిమగిరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేందుకు రిటైర్డ్ ప్రొఫెసర్ విష్ణుకాంత్ శుక్లా టికెట్ కొన్నారు. టికెట్ తీసుకుని రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో టీటీఈ చెకింగ్‌కు వచ్చారు. విష్ణుకాంత్ టికెట్‌ను ప్రరిశీలించిన టీటీఈ ఆ టికెట్‌పై తేదీ చూసి షాకైయ్యారు. దానిపై 19 నవంబర్ 3013 అని ఉంది. దాంతో విష్ణును టికెట్టు లేని ప్రయాణికుడిగా గుర్తిస్తూ.. ఆయను అవమానించి రైలు నుంచి కిందకి దింపేశారు.
తాను రిటైర్డ్ ప్రొఫెసర్‌నని, టికెట్ కొనకుండా ప్రయాణించే వ్యక్తిని కాదని ఆయన ఎంత మోత్తుకున్న టీటీఈ వినుపించుకోకుండా ఆయనను బలవంతంగా కిందకు దింపారు. దాంతో తీవ్ర మనస్థాపనాకి గురైన విష్ణుకాంత్ వినియోగదారుల కోర్టులో కేసు వేశారు. కేసు విచారించిన కోర్టు ఆయన పరువుకు నష్టం కలిగిందని, ఆయనకు అవమానం జరిగిందని భావించి, 13 వేల నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా భారతీయ రైల్వేస్‌కు ఆదేశించింది. దీనిపై విష్ణుకాంత్ స్పందిస్తూ.. టికెట్ కొని ప్రయాణిస్తున్న తనను అందరి ముందు అవమానించి, రైలు నుంచి బలవంతంగా దింపేశారని అన్నారు. ఆ రోజు తను మిత్రుడి చనిపోతే చివరి చూపులకు వెళ్తున్నానని తెలిపారు. రిటైర్డ్ ప్రొపెసర్ అయినే నాకు టికెట్ కొని ప్రయాణించాలన్న కనీస జ్ఞానం ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment