సేవాపన్ను మాయాజాలం! | mahesh vijapurkar article on srvice tax | Sakshi
Sakshi News home page

సేవాపన్ను మాయాజాలం!

Published Tue, Apr 25 2017 2:32 AM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM

సేవాపన్ను మాయాజాలం!

సేవాపన్ను మాయాజాలం!

విశ్లేషణ
సేవాపన్ను చెల్లించడం తప్పనిసరి కాదని, రెస్టారెంట్ల యజమానులు బిల్లులో ఖాళీ చోటును వదిలిపెడితే, తాము పొందిన సేవకు ద్రవ్యపరమైన విలువను చెల్లించడంపై కస్టమర్లే నిర్ణయించుకుంటారని కేంద్ర మంత్రి సూచించారు.

బిల్లు భారీగా ఉన్నప్పటికీ, మంచి ఆహారాన్ని ఆస్వాదించి, చక్కటి సేవను పొందిన కస్టమర్‌.. వెయిటర్‌కు టిప్‌ ఇవ్వడానికి ఇష్టపడతాడు. తాను పొందిన సేవకే ఆ అభినందన కాబట్టి మీకు సేవ చేసిన వ్యక్తికి ఆ టిప్‌ అందుతుంది లేదా అందాలి కూడా. వెయిటర్‌ హోటల్లో ఉద్యోగి అయినప్పటికీ టిప్‌ తనకే అందుతుంది. చాలా కాలంగా ఇలాగే జరుగుతూ వస్తోంది కూడా.

అయితే హోటల్‌ పరిశ్రమ దీన్ని మరోలా చూస్తోంది. మీకు సేవలందించిన వెయిటర్‌కి మీరు టిప్‌ ఇస్తారా లేదా అనేది మీ ఛాయిస్‌. కానీ టిప్‌తో సంబంధం లేకుండా బిల్లులో పొందుపర్చే సేవా పన్నును మాత్రం మీరు తప్పక చెల్లించాల్సి ఉంటుంది. అలాగని ఇది కేంద్ర ప్రభుత్వం వాస్తవంగా ప్రతి వస్తువుపైనా క్రమానుగతంగా విధించే సేవా పన్ను వంటిది కాదు. మీడియాలో పేర్కొన్న అనేక వాదనల బట్టి, సేవా పన్ను అనేది వెయిటర్‌కి మాత్రమే వెళ్లడం లేదని, ఆ హోటల్‌లోని చెఫ్, క్లీనర్‌ వంటి మంచి సేవలను అందించిన ప్రతి ఒక్కరికీ వెళుతున్నట్లు కనిపిస్తుంది. పైగా యజమాని కూడా దాంట్లో కొంత భాగాన్ని తీసుకుంటాడని అనుమానం ఉంది.

గతంలో అయితే చాల ప్రాంతాల్లో వెయిటర్‌కి తక్కువ జీతం ఇచ్చేవారు. తగిన సేవతో కస్టమర్‌ని అతడు సంతృప్తిపర్చినట్లయితే, టిప్‌ మొత్తంగా లేదా దాంట్లో చాలా భాగం తనదే అవుతుందని చెప్పేవారు.  కాబట్టి సిబ్బంది ఖర్చుల చెల్లింపు భారం యజమాని నుంచి బదిలీ అయ్యేది. ఇప్పుడు మనం సేవా పన్ను కూడా అలాగే ఉంటుందని మనం ఊహించవచ్చు. బిల్లులో ఈ చార్జిని సూచించారు. ఇది తప్పనిసరిగా చెల్లించాల్సిన మొత్తం కాదని కేంద్రం చెప్పడానికి ముందు, అది సేవా పన్నువంటిదేనని దానిని చెల్లిం చాల్సి ఉంటుందని రెస్టారెంట్లకు వచ్చే పలువురు సందర్శకులు లేదా కస్టమర్లు భావించేవారు. పైగా చాలావరకు ఆ సేవా రుసుము అనేది వెయిటర్‌కే పోతుందనుకునేవారు. కానీ ఆ టిప్‌ను కూడా ఉద్యోగులు, యజ మానులూ అందరూ పంచుకునేవారని ఇంతవరకు మనకు తెలీదు.

ఇప్పుడు కేంద్ర వినియోగదారు వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌.. సేవాపన్ను చెల్లించడం తప్పనిసరి కాదని, దాన్ని చెల్లించాలా వద్దా అనే విషయాన్ని కస్టమర్‌ నిర్ణయించుకుంటారని, రెస్టారెంట్‌ యజమానులు బిల్లులో కాస్తంత ఖాళీ చోటును వదిలి పెడితే తాము హోటల్‌ సిబ్బంది నుంచి పొందిన సేవకు ద్రవ్యపరమైన విలువను చెల్లించాలా వద్దా అనే విషయాన్ని కస్టమరే నిర్ణయించుకుంటారని సూచించారు.

పైగా, రెస్టారెంట్‌ యజమానులు బిల్లుల్లో తాము విధించిన సర్వీస్‌ చార్జిని తప్పనిసరిగా ప్రదర్శించాలి. అప్పుడు సేవా రుసుమును దానికీ వర్తింపజేయాలా వద్దా అనేది కస్టమరే నిర్ణయించుకుంటాడు. అంటే ఈ సర్వీస్‌ చార్జీని కూడా తాము చెల్లించాలా వద్దా అనేది కస్టమరే తేల్చుకుంటాడు.  ప్రజారంగంలో పనిచేస్తున్న రెస్టారెంట్‌ యజమానులకు మొత్తంమీద ఈ సూచన బాగానే ఉన్నట్లుంది. తాము హోటల్లో ఆరగించే పదార్ధాలపై సర్వీస్‌ చార్జీ ఉంటుందని ముందుగానే కస్టమర్లకు సూచించినట్లయితే, అప్పటి నుంచి సర్వీస్‌ చార్జి విధించని రెస్టారెంట్లకు మాత్రమే అలాంటి కస్టమర్లు వెళతారని వీరంటున్నారు.

ఈ సేపా పన్ను లేదా లెవీపీ తొలి అధికారిక దృష్టికోణం ఈ సంవత్సరం జనవరి నెలలోనే కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వానికి తట్టింది. ఇప్పుడు దాన్ని ఒక తప్పనిసరి అవసరంలాగా పొందుపరుస్తూ. అధికారికంగా ప్రకటించారు. ఇకపై హోటల్‌లో అందుకున్న సేవలకు గాను సర్వీస్‌ చార్జి ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం కస్టమరే తేల్చుకుని నిర్ణయించుకోవడానికి తగిన మార్గదర్శక సూత్రాలు జారీ చేసినట్లు కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ తాజాగా ట్వీట్‌ చేశారు. ఈ మార్గదర్శక సూత్రాల ఉల్లంఘనను ఎవరైనా అతిక్రమించినట్లయితే స్థానికంగా ఉండే కన్సూమర్‌ కోర్టుకు ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పినట్లు ఇలాంటి ఫిర్యాదులతో వ్యవహరించడానికి ఒక సాధికార సంస్థ ఏర్పాటుకు కొత్త చట్టం అనుమతిస్తుంది. ఇది నిజంగానే విచిత్రమైనదే. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇది గుర్రం ముందు బండిని కట్టడం లాంటిదే.

ఏదేమైనా ప్రస్తుతం ఒక పరిణామానికి  మీరు సిద్ధపడాల్సిందే మరి. వంటగది నుంచి మీ టేబుల్‌ వద్దకు ఆహారం తీసుకురావడం తమ పని కాదని ప్రకటిస్తూ దానికోసం కస్టమర్‌కి సర్వీస్‌ చార్జిని విధిస్తున్న రెస్టారెంట్లు ఇకపై సేవారుసుమును పొందుపరుస్తూనే మరోవైపున దానిని దాచిపెట్టే సమగ్ర బిల్లును ఎంచుకోవచ్చు. వాస్తవం ఏమిటంటే సేవా పన్నును కలిపిన అలాంటి బిల్లులను నేను గతంలో బలవంతంగా చెల్లించి ఉన్నాను. నాకు తెలిసిన ఒక చార్టర్డ్‌ అకౌం టెంట్‌తో దీన్ని తనిఖీ చేసినప్పుడు, ఆహారం ధరలు, సర్వీస్‌ చార్జి వివరాలను స్పష్టంగా హోటల్‌ యజ మానులు అధికారులకు తెలియపరుస్తున్నంతవరకు అలాంటి బిల్లు అనుచితమైంది కాదని ఆయన చెప్పారు.

మహేష్‌ విజాపృకర్‌
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌ : mvijapurkar@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement