డబ్బులు డ్రా చేయకున్నా, చేసినట్టుగా ఓ ఎకౌంట్ నుంచి తగ్గించినందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచికు కన్సూమర్ ఫోరమ్ జరిమానా విధించింది.
ముజఫర్నగర్: డబ్బులు డ్రా చేయకున్నా, చేసినట్టుగా ఓ ఎకౌంట్ నుంచి తగ్గించినందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచికు కన్సూమర్ ఫోరమ్ జరిమానా విధించింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ పీఎన్బీ బ్రాంచ్ ఖాతాదారు సుబే సింగ్.. గతేడాది జనవరి 5న పీఎన్బీ బ్రాంచ్ ఏటీఎమ్ నుంచి 15 వేల రూపాయలు డ్రా చేసేందుకు వెళ్లాడు. ఏటీఎమ్ నుంచి అతనికి డబ్బులు రాలేదు. అయితే డబ్బులు తీసుకున్నట్టు ఆయన ఎకౌంట్ నుంచి ఈ మొత్తాన్ని తగ్గించారు. సుబే సింగ్ ఈ విషయంపై కన్సూమర్ కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన కన్సూమర్ కోర్టు పీఎన్బీ అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబట్టింది. పీఎన్బీకి జరిమానా విధిస్తూ.. సుబే సింగ్కు నెల రోజుల్లోగా 22 వేల రూపాయలను చెల్లించాల్సిందిగా ఆదేశించింది.