
సాక్షి, హైదరాబాద్ : సెంట్రల్ మాల్‌కు అధికారులు షాకిచ్చారు. 10 రూపాయల కోసం కక్కుర్తి పడిన మాల్ యాజమాన్యానికి దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చారు. వివరాల ప్రకారం..హైదరాబాద్‌లోని కవాడిగూడకు చెందిన వి. బెజ్జం అనే వ్యక్తి ఇటీవలె సెంట్రల్ మాల్‌లో 1400 రూపాయలు చెల్లించి ఓ షర్ట్‌ను కొనుగోలు చేశాడు. ప్యాకింగ్ అనంతరం షర్ట్‌ను మాల్ లోగో ముద్రించిన పేపర్ బ్యాగ్ ఇచ్చి పది రూపాయలు వసూలు చేశారు. దీనిపై కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఫిర్యాదుదారునికి పరిహారంగా మాల్ యాజమాన్యం 15వేలు చెల్లించాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment