టాప్–5లో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా
వీ–కామర్స్ (వీడియో కామర్స్)ను అందిపుచ్చుకుంటున్న వైనం
వీ–కామర్స్ వైపు మొగ్గుచూపుతున్న ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు
తాజా అధ్యయనంలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మనోళ్లు వీ–కామర్స్ (వీడియో కామర్స్)లోనూ దుమ్మురేపుతున్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఓ అడుగు ముందే ఉంటున్న భారత యువతరం వీ–కామర్స్‌లోనూ ముందుకు సాగుతోంది. టెక్, డిజిటల్, ఆన్‌లైన్ షాపింగ్‌లో ముందంజలో ఉంటున్న భారతీయులు వీ–కామర్స్‌ను సైతం సులభంగా అందిపుచ్చుకుంటున్నారు. వీడియో మాధ్యమం ఆధారంగా భారత కస్టమర్లు వీ–కామర్స్ ఆఫర్లు, డీల్స్‌ను పరిశీలిస్తున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పటికే అత్యధికంగా ఇంటర్నెట్ డేటా వినియోగిస్తున్న దేశాల్లో భారత్ ఒకటన్న విషయం తెలిసిందే. 2023 జూన్–2024 మే మధ్యలో ఇంటర్నెట్‌లో మనవాళ్లు 20 లక్షల గంటలకుపైగా ఈ డీల్స్, ఆఫర్స్‌ను సమీక్షించినట్టుగా వెల్లడైంది.
ఈ విషయంలో దేశీయంగా చూస్తే టాప్–5 నగరాల్లో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా నిలిచాయి. ఇంతేకాకుండా వీ–కామర్స్ వైపు ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాలు (వీరిలో 30 ఏళ్లలోపు వారు, మహిళలు అధికం) కూడా మొగ్గుచూపుతున్నట్టు తేలడం విశేషం. డైరెక్ట్ టు కన్జుమర్ (డీ 2 సీ) బ్రాండ్లు, విక్రయదారులు, రైతులు ఇతర వర్గాల వారు కూడా వీ–కామర్స్ ఆఫరింగ్స్ పట్ల ఉత్సాహం చూపడంతోపాటు ఇందులో తమకు ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయంతో ఉన్నట్టుగా రెడ్‌సీర్ అధ్యయనం నివేదిక స్పష్టంచేసింది.
దీనిని ఉటంకిస్తూ... వీడియో కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, వీ–కామర్స్ పట్ల భారత్‌లో సానుకూల స్పందన పెరుగుతున్నట్టుగా పేర్కొంది. మొత్తంగా వీడియో కామర్స్ పరంగా (ఓవరాల్ వీడియో కామర్స్ ఎంగేజ్‌మెంట్) చూస్తే టయర్ 2, 3 ప్రాంతాల్లోని వారు 65 శాతం దాకా ఉన్నట్టుగా ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ప్రధానంగా ఫ్యాషన్, బ్యూటీ, పర్సనల్ కేర్, హోమ్ డెకర్, ఫరి్నíÙంగ్‌పై వీరు దృష్టి పెడుతున్నట్టు తెలిపింది. ఈ ఏడాది తాము నిర్వహించిన ఫార్మర్స్ అల్ఫాన్సో మ్యాంగో డే లైవ్ స్ట్రీమ్ (రైతు నుంచి వినియోగదారుడిని నేరుగా కలిపేలా), బిగ్ భారత్ డీ 2 సీ లైవ్ స్ట్రీమ్, ద ఎండ్ ఆఫ్ సీజన్ సేల్, జీరో అవర్ వంటి కార్యక్రమాలకు మంచి స్పందన రావడంతోపాటు వినియోగదారులు పెద్దఎత్తున కొనుగోళ్లు జరిపేందుకు అవకాశం ఏర్పడిందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment