మూడు రూపాయల చిల్లర ఇవ్వడానికి నిరాకరించిన జిరాక్స్ షాప్ యజమానికి భారీ షాక్ తగిలింది. పైగా బెగ్గర్ అంటూ కస్టమర్‌ని దుర్బాష లాడాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు కస్టమర్ వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీంతో రూ.25,000 జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఒడిశాలోని సంబల్‌పూర్‌లోని ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక ఫోటోకాపీ దుకాణం యజమాని కస్టమర్‌కు రూ.3 తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన కేసును విచారించిన సంబల్‌పూర్ కోర్టు రూ. 25 వేలు 30 రోజుల్లోపు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు నిర్ణీత గడువులోగా జరిమానా చెల్లించకుంటే సంవత్సరానికి 9 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని కూడా తీర్పునిచ్చింది.
బుధరాజా ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ప్రఫుల్ల కురార్ దాస్ ఏప్రిల్ 28న జిరాక్స్ కోసం ఫోటో కాపీ సెంటర్‌కి వెళ్లాడు. కాపీ రూ.2 ల చార్జీకి గాను రూ. 5 దుకాణదారుడికిచ్చాడు. మిగిలిన రూ. 3 తిరిగి అడగ్గా ఇవ్వడానికి నిరాకరించాడు. అంతేకాదు బెగ్గర్ అంటూ దుర్భాషలాడాడు. అడగ్గా .అడగ్గా. ..పైగా బిచ్చమేశా అనుకుంటూ అంటూ అనుచితంగా ప్రవర్తించాడు.
దీంతో తనకు చిల్లర ఇవ్వకపోగా, దురుసుగా ప్రవర్తించడంతోపాటు రసీదు కూడా ఇవ్వలేదంటూ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. తనకు ఆర్థిక నష్టంతోపాటు, మానసిక వేదన, అవమానానికి గురయ్యానంటూ పేర్కొన్నారు. ఇది కేవలం వ్యక్తిగత కేసు మాత్రమే కాదు. వినియోగ దారులందరి హక్కులకు సంబంధించింది. అందుకే కోర్టును ఆశ్రయించి, న్యాయం పొందాను అంటూ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment