సాక్షి, హైదరాబాద్: క్యాబ్ సేవల సంస్థ ఓలాకు ఎదురు దెబ్బ తగిలింది. ఒక కస్టమర్ నుంచి ఎక్కువ చార్జీ వసూలు చేసినందుకు పరిహారం చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన బాధితుడు జబేజ్ శామ్యూల్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన కోర్టు నాసిరకం సర్వీస్, ఓవర్ ఛార్జింగ్ కారణంగా మొత్తం రూ. 95,000 పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. (లక్ అంటే టెకీలదే: అట్లుంటది ఐటీ కొలువంటే!)
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ఓలా క్యాబ్స్ నుండి పరిహారం కోరుతూ ఫిర్యాదు దారు జబేజ్ శామ్యూల్ 2021, అక్టోబరు 19న నాలుగు గంటలకు ఓలా క్యాప్ బుక్ చేసుకున్నాడు. భార్య, మరొకరితో కలిసి క్యాబ్ ఎక్కినపుడు అంతా డర్టీగా కనిపించింది. ఏసీ ఆన్ చేయమన్నా, డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. అంతేకాదు నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత శామ్యూల్‌ని మధ్యలోనే దింపేశాడు. దీనిపై ఓలాను సంప్రదించినప్పటికీ ఫలితం కనబడలేదు. పైగా రూ. 861 ఫీజు చెల్లించాల్సిందిగా పదేపదే కోరడంతో విసిగిపోయిన కస్టమరు దాన్ని చెల్లించారు. (భారీ నష్టాలు: సెన్సెక్స్ 650 పాయింట్లు పతనం)
దీంతో హతాశుడైన శామ్యూల్ వినియోగదారుల చట్టం సెక్షన్ 35 కింద హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ - III ను ఆశ్రయించారు. దాదాపు రూ.5 లక్షల పరిహారం ఇప్పించాల్సిందిగా కోరారు. దీన్ని విచారించిన కోర్టు 5 లక్షల అంటే, చాలా పెద్ద మొత్తం అని అభిప్రాయపడినకోర్టు, ట్రిప్ చార్జీ, రూ. 861 వడ్డీతో (సంవత్సరానికి 12శాతం చొప్పున), అలాగే మానసిక వేదనకుగాను రూ. 88వేలు, ప్రొసీడింగ్స్ ఖర్చుల నిమిత్తం రూ. 7 వేలు కలిపి మొత్తం 95 వేల రూపాయలు చెల్లించాలని కమిషన్ ఓలా క్యాబ్‌ను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment