Hyderabad Theatre Fined Rs 1 Lakh For Wasting Time On Advertisements: హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కు కంజ్యూమర్స్ ఫోరమ్ లక్ష రూపాయల జరిమాన విధించి షాకిచ్చింది. షో సమయానికి కంటే 15 నిమిషాలు ఆలస్యంగా సినిమా వేసి తన సమయాన్ని వృథా చేశారంటూ రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన వినియోగదారుల కోర్టు తాజాగా సదరు థియేటర్‌కు లక్ష రూపాయల జరిమాన విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన విజయ్ గోపాల్ అనే వ్యక్తి టికెట్‌పై ముద్రించిన సమయానికి సినిమా ప్రారంభించకుండా ప్రకటనలు వేసి 15 నిమిషాలు ఆలస్యంగా షో వేశారని ఆరోపిస్తూ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.
చదవండి: షాకిస్తున్న అనసూయ లేటెస్ట్ లుక్, ఈ రేంజ్‌లో గ్లామర్ ఇచ్చిందా!
ఈ క్రమంలో 15 నిమిషాలు తన సమయాన్ని వృథా చేసిన సదరు థియేటర్‌పై చర్యలు తీసుకోవాలంటూ కేసు నమోదు చేశాడు. అంతేగాక తనకు న్యాయం చేయాలంటూ అతడు విజ్ఞప్తి చేశాడు. విజయ్ తన ఫిర్యాదులో ‘2019 జాన్ 22న వచ్చిన గేమ్ ఓవర్ సినిమాను చూసేందుకు కాచిగూడ క్రాస్ రోడ్స్‌లోని ఓ థియేటర్లు వెళ్లినట్లు చెబుతూ ఆధారాలన్నిటీని సమర్పించాడు. టికెట్‌పై ముంద్రించిన సమయం ప్రకారం సినిమా సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కావాలి, కానీ సాయంత్రం 4:45 గంటలకు ప్రారంభించారని ఆరోపించాడు.
చదవండి: ‘పుష్ప’ టీమ్‌కి భారీ షాక్, ఆందోళనలో దర్శక-నిర్మాతలు
15 నిమిషాలు ప్రకటనలు వేసి తన సమయం వృథా చేశారంటూ థియేటర్ మేనేజర్‌కు కూడా ఫిర్యాదు చేశానని, అయితే, ఆయన స్పందించలేదని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌కు చెప్పాడు. దీంతో ఈ కేసులో రెండో ప్రతివాదిగా లైసెన్సింగ్ అథారిటీ 'హైదరాబాద్ పోలీస్ కమిషనర్'ను చేర్చారు. అయితే, తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ చట్టం-1955 ప్రకారం పాత విధానం ప్రక్రారమే ప్రకటనలు వేస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం సమర్థించుకునే ప్రయత్నం చేసింది. తమకు ఆర్టికల్ 19(1)(జీ), (ఏ) ప్రకారం ప్రకటనలు వేసే హక్కు ఉందని తెలిపింది.
చదవండి: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఓటీటీలోకి పుష్ప మూవీ
అయితే, ఐనాక్స్ సంస్థ వాదనలను వినియోగదారుల ఫోరం తప్పుపట్టింది. చట్టం ప్రకారం కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉచిత ప్రకటనలు వేసే హక్కు ఉందని తెలిపింది. అంతేగాక, వాణిజ్య ప్రకటనలు వేయడం నిబంధనలకు విరుద్ధమని తీర్పు వెలువరించి, ఫిర్యాదుదారుడికి పరిహారంగా రూ. 5 వేలు, కేసు ఖర్చుల కింద మరో రూ. 5 వేలు చెల్లించాలని తాజాగా తీర్పు ఇచ్చింది. అంతేగాక, లైసెన్సింగ్ అథారిటీ అయిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కి పెనాల్టీ కింద లక్ష రూపాయలు జరిమాన చెల్లించాలని ఆదేశించింది. ఆ థియేటర్ నుంచి వచ్చే ఈ డబ్బును థియేటర్లలో భద్రతకు, విపత్తు నిధిగా వినియోగించాలని పోలీసులకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment