సముద్రంపై సత్తాకు మోదీ సర్కార్ యోచన | Modi Government Plans Huge Show of Strength in Indian Ocean: Report | Sakshi
Sakshi News home page

సముద్రంపై సత్తాకు మోదీ సర్కార్ యోచన

Published Wed, Jul 22 2015 7:49 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

సముద్రంపై సత్తాకు మోదీ సర్కార్ యోచన - Sakshi

సముద్రంపై సత్తాకు మోదీ సర్కార్ యోచన

న్యూఢిల్లీ: హిందూ మహా సముద్రంపై తన గుత్తాధిపత్యాన్ని, నావికా బలగంలో తన సత్తాను భారత్ ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటుంది. ఇందుకోసం ప్రపంచ అగ్ర రాజ్యాలైన అమెరికా, జపాన్తో కలిసి సంయుక్తంగా సముద్రంపై ప్రత్యేక యుద్ధక్రీడను నిర్వహించనుంది. గతంలో ఎనిమిదేళ్ల కిందట చైనా ఇలాంటి డ్రిల్ డ్రిల్ చేసింది. ఇటీవల కాలంలో హిందూమహాసముద్రం నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ సముద్రంపై పరోక్షంగా ఆధిపత్యం చెలాంయించేందుకు చైనా పోటీదారుగా భారత్ నిలుస్తోంది.

అటు భూసరిహద్దు విషయంలోను చైనా వ్యవహారం శృతిమించుతున్న నేపథ్యంలో పరోక్షంగా భారత్ సత్తాను చూపించాలనే ఉద్దేశంతో భారీ స్థాయిలో సముద్ర తలంపై మోదీ సర్కార్ భారత నౌకా విభాగంతో భారీ యుద్ధ క్రీడను నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే భారత్, అమెరికా, జపాన్ మిలటరీ అధికారులు జపాన్లోని యోకోసుకా అనే నేవీ స్థావరం బుధవారం, గురువారం రెండు రోజులపాటు చర్చలు జరుపుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. భారీ స్థాయిలో ఈ ఎక్సర్సైజ్ మూడు దేశాలు ఉమ్మడిగా నిర్వహించాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement