
మహారాణిపేట(విశాఖ దక్షిణం): మాల్దీవులు, దానిని అనుకుని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో మాల్దీవుల ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.