రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు
మహారాణిపేట: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో ఇది వాయవ్యంగా ఉత్తర తమిళనాడు, దక్షణ ఆంధ్రా దిశగా ఏపీ తీరానికి ఆనుకుని ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల బుధవారం కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది.
చాలా ప్రాంతాల్లో శీతల వాతావరణం నెలకొంది. గురువారం కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో సాధారణ వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, విశాఖ, అల్లూరి జిల్లా, విజయనగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment