మలేషియా విమాన శకలాలను గుర్తించిన చైనా శాటిలైట్లు | China investigates new images of Missing plane | Sakshi
Sakshi News home page

మలేషియా విమాన శకలాలను గుర్తించిన చైనా శాటిలైట్లు

Published Sat, Mar 22 2014 6:53 PM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM

తప్పిపోయి విమాన శకలంగా భావిస్తూ  చైనా టెలివిజన్ విడుదల చేసిన  ఫొటో

తప్పిపోయి విమాన శకలంగా భావిస్తూ చైనా టెలివిజన్ విడుదల చేసిన ఫొటో

కౌలాలంపూర్(ఐఏఎన్ఎస్): తప్పిపోయిన మలేషియా విమాన శకలాలను చైనా శాటిలైట్లు గుర్తించాయి.   కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో చైనా రాజధాని బీజింగ్ బయలుదేరిన మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్370 ఈ నెల 8వ తేది  అదృశ్యమైన విషయం తెలిసిందే. ఇందులో అయిదుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఈ విమానం తప్పిపోయినప్పటి నుంచి  దాని కోసం దాదాపు 26 దేశాలు గాలిస్తూనే ఉన్నాయి. విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారని, ప్రమాదానికి గురైందని ...పలు రకాల కథనాలు వినవచ్చాయి.

ఈ నేపధ్యంలో   విమాన శకలాలను తమ శాటిలైట్లు గుర్తించాయని చైనా చెప్పినట్లుగా మలేషియా ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు రెండు వారాలుగా కనిపించకుండాపోయిన మలేషియా విమానం ఆచూకీ దొరికినట్లు తెలుస్తోంది. ఎమ్‌హెచ్‌-370 విమానం భాగాలు చైనా దక్షిణ ప్రాంతంలో కనిపించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.  హిందూమహాసముద్రంలో తేలుతున్న ఒక పెద్ద శకలం మలేషియా విమానానికి చెందినదిగా భావిస్తున్నారు. ఆ శకలం ఫొటోలను కూడా చైనా టెలివిజన్ విడుదల చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement